Dhurandhar 2: ధురంధర్ 2ను తొక్కేయాలని భారీ కుట్ర... ఆధారాలతో బయటపెట్టిన ఆదిత్యధర్

ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన మూవీ ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2). గతేడాది విడుదలైన ధురంధర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ఆదిత్యధర్ తెరకెక్కించారు. 2026లో భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన సినిమా ఏదైనా ఉందంటే అది ధురంధర్ 2 గురించే. ఉగాది, రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న ధురంధర్ 2 వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల డిమాండ్ నేపథ్యంలో ఈసారి హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ధురంధర్ 2 విడుదలైంది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ధురంధర్ 2.. ఆ అంచనాలను అందుకోవడంతో పాటు సినిమా మేకింగ్, స్క్రీన్ ప్లే విషయంలో సరికొత్త బెంచ్ మార్క్‌లు సృష్టిస్తోంది. విడుదలైన తొలి వారంలోనే 1000 కోట్ల రూపాయల మార్క్ అందుకున్నాడు రణ్‌వీర్ సింగ్. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు ఇండియాలో 623.42 కోట్ల రూపాయల నెట్.. 744.58 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. భారత్‌లో పాటు ఓవర్సీస్‌లోనూ ధురంధర్ 2 ప్రభంజనం సృష్టిస్తోంది. అక్కడ ఇప్పటి వరకు 262 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ధురంధర్ 2 మూవీ 1006.50 కోట్ల రూపాయలు రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Aditya Dhar Reacts to Dhurandhar 2 Controversy Slams AI Fake Image Propaganda

ధురంధర్ 2ని చూసిన సామాన్యులు, సెలబ్రిటీలు రణ్‌వీర్ సింగ్, ఆదిత్యధర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ధురంధర్ 2పై పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం ఒక పార్టీకి అనుకూలంగా తీసిన సినిమా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ధురంధర్ 2లో ఎలాంటి విశేషం లేదని, విసుగు పుట్టిస్తోందని, ప్రొపగాండ మాత్రమే ఉందంటూ నటి దివ్య స్పందన వ్యాఖ్యానించారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా థియేటర్‌లో ధురంధర్ 2ను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా.. ధురంధర్ 2పై సోషల్ మీడియాలో కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. తాజాగా హీరో రణ్‌వీర్ సింగ్ స్టైలీష్‌గా సిగరెట్ తాగుతున్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరో సిక్కు మతస్తుడు, తలపాగా ధరించి ఆయన సిగరెట్ తాగుతుండటంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిక్కు మతపెద్దలు మండిపడుతున్నారు. ఈ దుష్ప్రచారంపై దర్శకుడు ఆదిత్యధర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ధురంధర్ ది రివెంజ్‌పై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞుడిని, వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అయితే కొందరు వ్యక్తులు తాము ప్రచారం కోసం విడుదల చేసిన ప్రోమోలు, ఇతర ప్రచార సామాగ్రిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించి తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రణ్‌వీర్ సింగ్ పాత్ర (హంజా) తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్నట్లుగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని ఆదిత్యధర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే ఇది పూర్తిగా అబద్ధం. ధురంధర్ 2లో కానీ, మేం ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ప్రోమోలు, వీడియోలు, ఇతర ప్రచార సామాగ్రిలో అలాంటి వీడియో కానీ, సీన్ లేదు. ఇదంతా కేవలం ధురంధర్ 2ను అడ్డుపెట్టుకుని అలజడులు సృష్టించాలని చేస్తోన్న పని. సిక్కు మతస్తులు అంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌ను శ్రద్ధగా వారిపై గౌరవంతోనే చిత్రీకరించాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సృష్టిస్తోన్న ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిత్య ధార్‌ హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఈ ఫోటోలు క్రియేట్ చేసింది ఎవరు? అనే దానిపై చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X