Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రెజీనాపై రేప్ జరిగిందా? ఉత్కంఠ రేపుతున్న ‘ఎవరు’ టీజర్
క్షణం, గూఢచారి చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్ త్వరలో 'ఎవరు' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా వెంకట్ రామ్‌జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్‌తో పాటు రెజీనా కీలక పాత్రలో నటిస్తోంది.
'సాహో' రిలీజ్ డేట్ ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30కి వాయిదా పడటంతో... చాలా చిన్న సినిమాలు ఇదే మంచి తరుణంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ లిస్టులో 'ఎవరు' కూడా చేరిపోయింది. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా టీజర్ విడుదల చేశారు.
టీజర్ ఉత్కంఠ రేపే విధంగా ఉంది. తనపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని రెజీనా చంపేయడం, పోలీసులు ఆమెను అరెస్టు చేయడం, కోర్టు సీన్లతో ఆసక్తిని రేకెత్తిస్తూ టీజర్ సాగింది. ఈ కేసును పరిష్కరించడానికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ విక్రమ్ భాస్కర్(అడవి శేష్) ఎలాంటి నిజాలు వెలుగులోకి తెచ్చారు? అనే కోణంలో సినిమా ఆసక్తికరంగా ఉంటుందట.
ఎవరు, బలుపు, ఊపిరి, క్షణం వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.
క్షణం వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత అడివిశేష్, పివిపి సినిమా కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో మంచి అచనాలుఏర్పడ్డాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమాను ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దర్శకత్వం: వెంకట్ రామ్‌జీ, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, డైలాగ్స్: అబ్బూరి రవి, కాస్ట్యూమ్స్: జాహ్నవి ఎల్లోర్, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజ్.