‘ఎవరు’ ట్రైలర్... రెజీనా రేప్ విక్టిమా? హంతకురాలా?
అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా సోమవారం ట్రైలర్ విడుదల చేశారు. రెజీనా పోషించిన పాత్ర చుట్టూ ఈ సినిమా సాగుతుందని స్పష్టమవుతోంది.
ట్రైలర్ ఓపెనింగ్ సీన్లో రెజీనాపై ఎవరో అత్యాచారం చేసినట్లు చూపించారు. అనంతరం ఆ వ్యక్తిని రెజీనా హత్య చేస్తుంది. అయితే రెజానా అతడిని పథకం ప్రకారం హత్య చేశారా? లేక నిజంగానే ఆమెపై రేప్ జరిగిందా? అనే విషయాన్ని అన్వేషిస్తూ కథ ముందకు సాగుతుందని తెలుస్తోంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసేందుకు రంగంలోకి దిగిన పోలీస్ ఆఫసర్(అడవి శేష్) ఏం చేశారు అనేది ఆసక్తికర స్క్రీన్ ప్లేతో నడిపించారు.

ఎవరు, బలుపు, ఊపిరి, క్షణం వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.
దర్శకత్వం: వెంకట్ రామ్‌జీ, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ‌్రీచరణ్ పాకాల, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, డైలాగ్స్: అబ్బూరి రవి, కాస్ట్యూమ్స్: జాహ్నవి ఎల్లోర్, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజ్.


Click it and Unblock the Notifications











