అడవి శేష్ - నాని కాంబినేషన్‌లో మూవీ: అధికారికంగా ప్రకటించిన విలక్షణ హీరో

విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు టాలెంటెడ్ హీరో అడవి శేష్. కెరీర్ ఆరంభంలో విలన్‌గా మెప్పించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అప్పటి నుంచి విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇటీవలి కాలంలో వరుసగా 'క్ష‌ణం', 'గూఢ‌చారి', 'ఎవరు' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలతో విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేశ్ బాబు నిర్మాణంలో శశి కిరణ్ తిక్క తెరకెక్కిస్తోన్న 'మేజర్'లో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు అడవి శేష్.

గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందు చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం 'హిట్'. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాను హీరో నాని నిర్మించాడు. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 4.4 కోట్లు జరగగా, దాదాపు రూ. 7.50 కోట్ల రాబట్టి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే దీనికి సీక్వెల్ తీస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తాజాగా 'HIT 2'కు సంబంధించిన ప్రకటనను అధికారికంగా వెల్లడించారు. తద్వారా ఇందులో హీరో ఎవరు అనే సస్పెన్స్‌కు ఇప్పటికి తెరదించింది ఆ మూవీ యూనిట్.

Adivi Sesh Announce HIT 2 Movie Under Nani Production

'HIT'లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. రెండో భాగమైన 'HIT The Second Case'లో మాత్రం అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. ఇక, దీనికి 'నా ఫేవరెట్ పర్సన్ నానితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. నా మేజర్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఇది ప్రారంభం అవుతంది. ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది' అంటూ రాసుకొచ్చాడు. మొదటి భాగం కంటే బెటర్‌గా, బిగ్గర్‌గా ఉంటుందని కూడా వెల్లడించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X