నాతో సింక్‌ అవ్వలేదు .. డెకాయిట్ నుంచి శృతిహాసన్‌ ఔట్.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు అడివి శేష్. ఈ హీరో నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక విశేషం ఉందని ప్రేక్షకులు అర్ధం చేసుకుంటారంటే అడివి శేష్ ముద్రను అర్ధం చేసుకోవచ్చు. తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా, రైటర్‌గా, హీరోగా స్థిరపడిపోయారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కష్టపడి అన్ని రంగాలపై పట్టు సాధించి.. తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించారు అడివి శేష్.

రైటర్‌గా, డైరెక్టర్‌గా బిజీ
అమెరికాలో చదువుకున్న ఆయన సినిమాలపై పిచ్చితో ఇండియా వచ్చేశారు. నటనలో శిక్షణ తీసుకుని రాటు తేలాడు. పంజా, బలుపు, రన్ రాజా రన్, బాహుబలి వంటి చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలతో ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో క్షణం, ఊపిరి, అమీతుమీ, గూఢచారి, ఎవరు, హిట్ 2, మేజర్ సినిమాలు ఆయనకు ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చాయి. క్షణం, గూఢచారి, మేజర్ సినిమాలకు రైటర్‌గానూ పనిచేశారు.

డబ్బు మీద పిచ్చి లేదు
తనకు డబ్బు మీద పిచ్చి లేదని.. ఫ్రెండ్స్ కూడా ఈ విషయంలో తిడతారని అందుకే సినిమాపైనే ఫోకస్ పెడతానని అడివి శేష్ తెలిపారు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నానని అడివి శేష్ పేర్కొన్నారు. యాక్టింగ్, రైటింగ్ రెండూ నాకు ఇష్టమేనని.. దర్శకుడికి చాలా సహనం ఉండాలని అన్నారు. నేను ప్రతిది హృదయంతో ఆలోచిస్తానని.. కానీ దర్శకుడు మెదడుతో ఆలోచించాలని శేష్ అన్నారు.

Adivi Sesh Breaks Silence on Rumours about Shruti Haasan walkout from Dacoit

డెకాయిట్‌పై అంచనాలు
ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సునీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అనురాగ్‌తో ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జయిన్ మారి ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తొలుత శృతిహాసన్ హీరోయిన్‌గా ఎంపికవ్వగా.. అనివార్య కారణాలతో ఆమె తప్పుకోగా, మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్‌గా వచ్చి చేరారు. ఇటీవల విడుదలైన డెకాయిట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.

శృతిహాసన్‌తో విభేదాలు
శృతిహాసన్ అనూహ్యంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె తప్పుకోవడానికి గల కారణాలు ఏంటీ ? అనే దానిపై చిత్రసీమలో రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే అడివి శేష్‌తో ఉన్న విభేదాల కారణంగా శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివి శేష్ ఈ పుకార్లకు తెరదించారు. తమ ఇద్దరి మధ్యా ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పారు. ఇద్దరి మధ్య వర్కింగ్ స్టైల్ కుదరకపోవడం వల్లే ఆమె తప్పుకున్నట్లు శేష్ పేర్కొన్నారు. రజనీకాంత్ గారి కూలీ సినిమాలో శృతి బిజీగా ఉండటం కూడా ఒక కారణమని ఆయన తెలిపారు. ఒక సినిమా చేయాలంటే నాకు చాలా టైం పడుతుందని, మధ్యలో నాకు సింక్ అవ్వాలని అడివి శేష్ చెప్పారు. మృణాల్ ఠాకూర్ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే హీరోయిన్‌గా ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారని ఆయన తెలిపారు.

More from Filmibeat

Read more about: adivi sesh shruti haasan dacoit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X