‘మేజర్’ అప్డేట్.. ఫస్ట్ లుక్ రాబోతోంది!
విభిన్న కథ, కథనాలు ఎంచుకుని విలక్షణ నటనతో వరుసగా విజయాలు అందుకుంటున్నాడు అడివి శేష్. హీరోగానే కాకుండా మంచి కథకుడిగానూ అడివి శేష్ తెలుగు ప్రేక్షకుల మనసును దోచేస్తున్నాడు. క్షణం, గూఢాచారి, ఎవరు వంటి వరుస బ్లాక్ బస్టర్లతో అడివి శేష్.. తనకంటూ ఓ స్పెషల్ మార్కెట్‌ను సృష్టించుకున్నాడు. అడివి శేష్ సినిమా వస్తోందంటే.. ఏదో ఒక కొత్త దనం, యూనిక్ పాయింట్ ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.
ఆ అంచనాలకు తగ్గట్టే అడివి శేష్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. ముంబై 26/11 ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతోన్న మేజర్ సినిమా గురించి అడివి శేష్ స్వయంగా కొన్ని వివరాలను చెబుతూ ఆ మధ్యఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ కథతో ఎంత ఎమోషనల్‌గా అటాచ్ అయ్యాడో వివరించాడు. మేజర్ సందీప్‌ను చూస్తే సోదరబావం కలిగిందంటూ అడివి శేష్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.

తాజాగా మేజర్‌కు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను డిసెంబర్ 17 ఉదయం పది గంటలకు విడుదల కాబోతోందని ప్రకటించారు. మీరంతా సిద్దంగా ఉన్నారా? అంటూ అడివి శేష్ అప్డేట్‌పై అందరికీ ఆసక్తిని కలిగించాడు. ఈ మూవీని మహేష్ బాబు తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శశి కిరణ్ తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











