‘మేజర్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్: ‘లెటర్ టు సందీప్’ అంటూ సరికొత్త ప్రయోగం

విలన్‌ పాత్రలతో కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోగా మారాడు విలక్షణ నటుడు అడవి శేష్. కెరీర్ ఆరంభంలోనే బడా స్టార్ల సినిమాల్లో నటించిన అతడు.. హీరో అయిన తర్వాత ప్రత్యేకమైన పంథాను ఫాలో అవుతూ తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నాడు. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఇలా 'క్ష‌ణం', 'గూఢ‌చారి', 'ఎవరు' సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలతో వరుస హిట్లను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'మేజర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే అప్‌డేట్ గురించి ట్వీట్ చేశాడతను.

ముంబై నగరంలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమే 'మేజర్'. శ‌శికిర‌ణ్ తిక్క తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అడవి శేష్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నాడు. వాస్తవిక కథతో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి 'లెటర్ టు సందీప్' పేరిట ఓ అప్‌డేట్ రాబోతున్నట్లు హీరో ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ''పీపుల్ ఆఫ మేజర్' ఈరోజు సాయంత్రం 4.59 గంటలకు రాబోతుంది' అని పేర్కొన్నాడు. దీంతో అది ఏమై ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 Adivi Sesh Major Letter to Sandeep Update Today

అడవి శేష్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మేజర్'ను సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2021, జూలై 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X