Major: మొదటి రోజే మేజర్ నేషనల్ రికార్డు.. ఇండియాలోనే తొలి మూవీగా సంచలనం

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంట్ ఉన్న యంగ్ హీరోలు ఉన్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అడివి శేష్. విలన్‌గా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. ఆ తర్వాత సోలో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వైవిధ్యమైన చిత్రాలతో వస్తున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లను ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడీ యంగ్ టాలెంటెడ్ హీరో.

వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు 'మేజర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీన్ని ఎంతో ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్లు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫలితంగా అంచనాలు పెరగడంతో పాటు ఈ సినిమా బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే.

Adivi Seshs Major Movie Creates National Record

'మేజర్' మూవీ ఎమోషనల్ అండ్ యాక్షన్ బయోపిక్‌గా ఈరోజే (జూన్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో రెండు షోలు కూడా ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇది చాలా ఎమోషనల్‌గా ఉందని సినిమాను చూసిన వాళ్లంతా చెబుతున్నారు. దీనికితోడు రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌గా వస్తున్నాయి. దీంతోపాటు రేటింగ్ కూడా ఎక్కువగానే వచ్చింది. ఫలితంగా ఈ సినిమా యూనిట్‌తో పాటు అడివి శేష్ అభిమానులు, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకడైన టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రియల్ స్టోరీతో వచ్చిన 'మేజర్' మూవీ రిలీజ్ రోజే ఓ అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమాను రిలీజ్‌కు వారం రోజుల సమయం ఉన్నప్పటి నుంచి స్పెషల్ ప్రివ్యూ షోలు వేశారు. అలాగే, జూన్ 2వ తేది సాయంత్రం కూడా దేశ వ్యాప్తంగా 88 చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. ఈ షోలు అన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. ఇలా గతంలో ఏ సినిమా కూడా ఇన్ని ప్రీమియర్ షోలు వేయలేదు. దీంతో 'మేజర్' మూవీ నేషనల్ రికార్డును నమోదు చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

Adivi Seshs Major Movie Creates National Record

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రమే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేసింది. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ చరణ్ పాకాల ఈ బయోపిక్ మూవీకి సంగీతాన్ని అందించాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, రేవతి కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X