‘మేజర్’ సినిమా వాయిదా: అప్పుడే రిలీజ్ అంటూ అధికారికంగా ప్రకటించిన యూనిట్

విలక్షణ నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని దూసుకుపోతున్నాడు యంగ్ హీరో అడవి శేష్. వినూత్నమైన సినిమాలతో సత్తా చాటుతోన్న అతడు.. ప్రస్తుతం 'మేజర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో దీని విడుదలను వాయిదా వేస్తున్నట్లు యూనిట్ తాజాగా ప్రకటించింది.

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ నటిస్తోన్న చిత్రమే 'మేజర్'. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాను జూలై 2న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకుని, విడుదలను వాయిదా వేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రకటనను వదిలింది. అందులో 'కరోనా ప్రభావం కారణంగా మేజర్ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత దీన్ని సెలెబ్రేట్ చేసుకుందాం. కొత్త రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తాం' అని తెలిపారు.

Adivi Sesh Major Movie Release Postponed

భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'మేజర్' మూవీపై భారీ స్థాయిలో హైప్ ఉంది. ఈ సినిమా కోసం అడవి శేష్ ఎంతగానో కష్ట పడుతున్నాడు. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ చేసిన ఔట్‌పుట్ అదిరిపోయేలా వచ్చిందట. ఇక, ఈ సినిమాను సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X