‘మేజర్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: సాక్షిని పరిచయం చేయబోతున్న అడవి శేష్

కొంత కాలంగా తెలుగులో బయోపిక్‌ల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల జీవితాలకు సంబంధించిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముంబై నగరంలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. అదే.. 'మేజర్'. అడవి శేష్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాను శశి కిరణ తిక్క తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది.

అడవి శేష్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం 'మేజర్' ప్రమోషన్ వినూత్నంగా సాగుతోంది. దీని నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా జనాలు చర్చించుకునేలా కొత్త కొత్త పేర్లతో మాయ చేస్తున్నారు. తద్వారా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లుక్ టెస్ట్, ఫస్ట్ లుక్, లెటర్ టు సందీప్ సహా ఎన్నో సర్‌ప్రైజింగ్ ఫొటోలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 'మేజర్' నుంచి మరో కొత్త క్యారెక్టర్‌ను పరిచయం చేయబోతున్నట్లు హీరో అడవి శేష్ వెల్లడించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటనతో కూడిన పోస్టర్‌ను కూడా వదిలాడు.

Adivi Sesh Major New Character Update

'ఆమె జీవితంలో అదో మామూలు రోజు. కానీ, అప్పుడే ఎటాక్ మొదలైంది. ఆ దుర్ఘటనకు ఆమె సాక్షి. మేజర్‌లోని కొత్త క్యారెక్టర్‌ను పరిచయం చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు అడవి శేష్. ఈరోజు సాయంత్రం 4.59 గంటలకు ఈ సర్‌ప్రైజ్ రివీల్ కాబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇది 2021, జూలై 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X