‘మేజర్’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన: జూలైలోనే రాబోతున్న మహేశ్ బాబు సినిమా
కెరీర్ ఆరంభంలో పవన్ కల్యాణ్ 'పంజా', రవితేజ 'బలుపు' వంటి సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించి.. హీరోగానూ సూపర్ సక్సెస్ అవుతున్నాడు విలక్షణ హీరో అడవి శేష్. ఇటీవలి కాలంలో విభిన్న చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడతను. ఆ మధ్య 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలతో విజయాలను అందుకున్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే మంచి యాక్టర్‌గా పేరొందాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'మేజర్' అనే మూవీలో నటిస్తున్నాడు.
ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న 'మేజర్' అనే సినిమాలో అడవి శేష్ నటిస్తున్నాడు. వాస్తవిక కథతో రూపొందుతోన్న ఈ సినిమాను 2021, జూలై 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక, ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర నిర్మాతల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేసి మరీ ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో ఆయన నటిస్తోన్న సినిమా రాకున్నా.. నిర్మిస్తోన్న 'మేజర్' మాత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా లుక్ టెస్ట్ వీడియోను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఆ మధ్య 'మేజర్' ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











