‘మేజర్’ లవ్ స్టోరీ.. సాయీ మంజ్రేకర్ లుక్ వైరల్
ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత చరిత్ర ఆధారంగా అడివి శేష్ ఓ ఈ మూవీని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మేజర్ అంటూ ఇప్పటికే వదిలిన వీడియోలు, టీజర్, పోస్టర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో అడివి శేష్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ నటించింది. తాజాగా మేజర్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది.
మేజర్ టీజర్ మార్చి 28న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మేజర్ మూవీ యూనిట్‌లో విషాదం నెలకొనడం, డైరెక్టర్ ఫ్యామిలీలో విషాదం నెలకొనడం, కరోనా కేసులు కూడా పెరగుతూ ఉండటంతో మేజర్ టీజర్‌ను వాయిదా వేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే మరో కొత్త డేట్‌ను ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. అయితే తాజాగా హీరోయిన్ ఫస్ట్ లుక్‌ను వదిలింది మేజర్ యూనిట్.

లెటర్ టు మేజర్ అంటూ హీరోయిన్ ఫస్ట్ లుక్ వదిలారు. ఇందులో మేజర్ సందీప్‌ను తాను ఎంతగా ప్రేమించిందో చెప్పుకొచ్చింది. ఆమె అతడిని స్కూల్‌లో కలిసింది.. ఆయనతో జీవితాన్ని పంచుకోవాలిన కలలు కన్నది.. ఆమె రాసిన వాటికంటే ఎక్కువగానే ఆశించింది.. అంటూ సాయీ మంజ్రేకర్ పాత్ర గురించి అడివి శేష్ వివరించాడు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ జూలై 2న రాబోతోంది


Click it and Unblock the Notifications











