వెనుకడుగు వేసిన ‘మేజర్’.. అందుకే టీజర్ వాయిదా!
అడివి శేష్ సినిమా వస్తోందంటే చాలు టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ మోస్తరు అంచనాలుంటాయి. క్షణం, ఎవరు, గూఢచారి వంటి సినిమాలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్‌ను తెరకెక్కించడంలో అడివి శేష్ శైలి వేరే. హీరోగా నటించడమే కాకుండా సినిమాకు సంబంధించిన కథ, కథనాల్లోనూ తన సత్తాను చాటుతుంటాడు. అలా ఇప్పుడు అడివి శేష్ మేజర్ చిత్రంతో అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.
ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ మూవీని మహేష్ బాబు జీఎంబీ బ్యానర్ మీద నిర్మించడం విశేషం. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లు అన్నీ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. అయితే మేజర్ టీజర్ అంటూ కొన్ని రోజులుగా తెగ సందడి చేశారు. కానీ తీరా అందరినీ నిరుత్సాహపరిచారు.

మేజర్ టీజర్ మార్చి 28న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మేజర్ మూవీ యూనిట్‌లో విషాదం నెలకొనడం, డైరెక్టర్ ఫ్యామిలీలో విషాదం నెలకొనడం, కరోనా కేసులు కూడా పెరగుతూ ఉండటంతో మేజర్ టీజర్‌ను వాయిదా వేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే మరో కొత్త డేట్‌ను ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ జూలై 2న రాబోతోంది.


Click it and Unblock the Notifications











