రేణు దేశాయ్, ఆమె పిల్లలతో యంగ్ హీరో మీట్.. అసలు విషయం ఏంటి?
Recommended Video
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, ఆమె పిల్లలతో యంగ్ హీరో మీట్ కావడం.. కాసేపు వారితో ముచ్చటించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పైగా ఇందుకు సంబందించిన ఫోటోలు స్వయంగా ఆ యంగ్ హీరోనే ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడంతో అవి కాస్త వెంటనే వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు? రేణు దేశాయ్, ఆమె పిల్లలతో ఎక్కడ మీట్ అయ్యాడు? వివరాల్లోకి పోతే..

ఎవరు హీరో అడవి శేష్
ఇటీవలి కాలంలో తనదైన నటనతో ఆకట్టుకుంటూ సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటున్న హీరో అడవి శేష్.. ఇటీవలే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, ఆమె పిల్లలతో కాసేపు జాలీగా గడిపారు. అందుకు సంబందించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ రేణు దేశాయ్ కుమారుడు అకీరా గురించి చెప్పారు.

అకీరా వాయిస్ గంభీరం.. మా ఇద్దరిలో సిమిలర్ పాయింట్స్
అందమైన కుర్రోడు అకీరాతో ఒక రోజు జాలీగా గడిపాను. అతనికి ఎవరు సినిమా బాగా నచ్చింది. అకీరా, నేను లంచ్ మీటింగ్‌లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ కుర్రాడి వాయిస్ చాలా గంభీరం. అకీరా పొడవు 6 అడుగుల 4 అంగుళాలు. మేమిద్దరం కూడా ఎడమచేతి వాటం కలిగిన వాళ్ళం. ఇలా మా ఇద్దరిలో అనేక సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి అని అడవి శేష్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
రేణు దేశాయ్ గురించి
ఇక రేణు దేశాయ్ గురించి ఆయన స్పందిస్తూ.. ఆమెలో అద్భుతమైన రచయిత దాగుందని ప్రశంసలు గుప్పించాడు అడవి శేష్. ఈ సందర్బంగా రేణు దేశాయ్, అకీరాతో కలసి దిగిన సెల్ఫీలు అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రెజీనాతో ఎవరు
అడవి శేష్ హీరోగా కొత్త దర్శకుడు రాంజీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఎవరు'. పీవీపీ సినిమాస్ బ్యానర్‌లో తెరకెక్కిన అడవి శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటించగా.. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించారు. మర్డర్ మిస్టరీతో రూపొందిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచే మంచి స్పందనను రాబట్టుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


Click it and Unblock the Notifications











