Major Release Date Announcement: మేజర్ న్యూ రిలీజ్ డేట్.. మహేష్ నుంచి స్పెషల్ అప్డేట్!
విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ సంచలనం అడివి శేష్ త్వరలోనే మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని మహేష్ బాబు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మొదటిసారి మహేష్ బాబు తన GMB ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే సోనీ పిక్చర్స్ కూడా ఈ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు మరో కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.
2008లో ముంబై అటాక్ నేపథ్యంలో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. అయితే అందులోనే కీలకమైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరగాధ చాలా ప్రత్యేకమైనది. దేశం కోసం ఎదురుగా చావు వచ్చినా కూడా భయపడని ఆ సైనికుడి గురించి చెప్పాలని గతంలో చాలా మంది అనుకున్నారు. ఇక కొన్ని సినిమాల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాయింట్ ను కూడా హైలెట్ చేశారు. అయితే ఇప్పుడు అడవి శేష్ మేజర్ సందీప్ పాత్రలో అతని జీవితాన్ని మొత్తం చూపించబోతున్నారు. శశికిరణ్ దర్శకత్వంలో వహిస్తున్న మేజర్ సినిమాలో మాత్రం సందీప్ కు సంబంధించిన జీవితాన్ని మొత్తం వెండితెరపై చూపించబోతున్నారు. అతని జీవితం ఎలా మొదలైంది అలాగే వారి కుటుంబ నేపథ్యాన్ని చిన్నప్పటి నుంచి ఎదుర్కొన సవాళ్లతో పాటు అతను చూసిన ప్రేమను కూడా సినిమాలో చూపించబోతున్నారు.
ఈ సినిమా కథ కోసం అడివి శేష్ కథను అందించాడు. అలాగే అబ్బూరి రవి అక్షత్ అజయ్ తెలుగు హిందీ లో డైలాగ్స్ అందించారు తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా హిందీ లో కూడా భారీగానే రిలీజ్ చేస్తున్నారు. అడివి శేష్ కు కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో మొన్నటివరకు ఒక టాక్ అయితే వినిపించింది. అయితే ఫిబ్రవరి 11వ తేదీన వస్తుందో రాదో అని అనుమానం కూడా చాలానే వచ్చాయి. కానీ విడుదల తేదీ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని మహేష్ బాబు అఫీషియల్ గా ఒక వీడియో రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు.

మేజర్ సినిమా ఫిబ్రవరి 11 వ తారీకు అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. వీడియో లో సినిమా మేకింగ్ విజువల్స్ గురించి చాలా చక్కగా చూపించారు. ఇక ఇటీవల షూటింగ్ పూర్తయిందని చెబుతూ 120 రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు తెలియజేశారు. దాదాపు 75 లోకేషన్స్ లో 7 రకాల విభిన్నమైన సెట్స్ లలో షూట్ చేశారట. ఇక తెలుగు హిందీ మలయాళం 3 భాషల్లో సినిమాను ఒకేసారి విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











