ఆ అమ్మాయి కోసం దేశ సరిహద్దు దాటా.. లవ్ స్టోరీ బయటపెట్టిన అడివి శేష్ !

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్ (Adivi Sesh). అడివి శేష్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచిన శేష్, ఇప్పుడు తన కొత్త సినిమా 'డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల అవుతుండగా, ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఓ ఈవెంట్ లో అడివి శేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

'డెకాయిట్'.. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథను కూడా ఆయన అడివి శేష్‌తో కలిసి రచించారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా షానీల్ డియో పరిచయం అవుతున్నారు.ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో టాలీవుడ్‌లో నటుడిగా అరంగేట్రం చేయడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా డెకాయిట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Adivi Sesh Reveals First Love Story at Dacoit Event Crossed Borders for Love

ఇక ట్రైలర్‌ను చూస్తే, ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని స్పష్టమవుతోంది. ఈమూవీ ప్రేమ-ప్రతీకారం-యాక్షన్ అంశాల మేళవింపుతో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. ట్రైలర్‌లో హరి పాత్రలో కనిపించిన అడివి శేష్, జూలియట్ పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్‌తో కలిసి ఒక సాధారణ జీవితం గడపాలని కలలు కనే యువకుడిగా కనిపించాడు. అయితే అనుకోని మోసం కారణంగా అతను జైలుకి వెళ్తాడు. అనంతరం తన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవాలని, ముఖ్యంగా తన మాజీ ప్రేయసితో కలిసి ఉండాలని జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలు, దోపిడీలు, కార్ ఛేజ్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ ఈవెంట్‌లో అడివి శేష్ మాట్లాడుతూ తన తన తొలి ప్రేమకథను అభిమానులతో పంచుకున్నారు. అమెరికాలో ఉన్న సమయంలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని, ఆమెను వెంబడిస్తూ దేశ సరిహద్దులు దాటి కెనడా వరకు వెళ్లినట్లు చెప్పారు. 'నా దగ్గర డబ్బులు కూడా లేవు. అయినా ప్రేమ కోసం దేశ సరిహద్దు దాటాను. అక్కడ ఎవరైనా భారతీయులు ఉంటారా అని అడిగాను, ఎవరి ఇంట్లోనైనా అవకాశం కోసం ప్రయత్నించాను' అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రయాణం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమనీ, తనతో గడిపిన ఆ ఆరు నెలలు తన జీవితాన్నే మార్చేసిందని చెప్పుకొచ్చారు.

అడివి శేష్ చెప్పిన ఈ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ కోసం ఆయన తీసుకున్న రిస్క్, ఎదుర్కొన్న కష్టాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 'ఆరు నెలలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి'అనే ఆయన వ్యాఖ్యలు భావోద్వేగాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇక 'డాకాయిట్' ట్రైలర్‌కు వచ్చిన స్పందనను బట్టి చూస్తే, ఈ సినిమా కూడా అడివి శేష్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X