Anushka Shetty: అనుష్కని అందుకే కొట్టా... ఆయన వల్లే ఆ తప్పు... అడివి శేష్

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు అడివి శేష్. కమర్షియల్ హంగులకు దూరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాలు చేస్తుంటారు శేష్. ఈ హీరో నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక విశేషం ఉంటుందని ఆడియన్స్‌లో ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు అడివి శేష్. తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా, రైటర్‌గా, హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విలక్షణ నటుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించారు అడివి శేష్. వివాదరహితుడిగా నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలుపుకుపోయే స్నేహశీలి శేష్. అలాంటి ఆయన.. అగ్రనటి అనుష్క శెట్టిపై చేయి చేసుకోవాల్సి వచ్చిందట. ఈ వివరాల్లోకి వెళితే..

అమెరికాలో చదువుకున్న ఆయన సినిమాలపై పిచ్చితో ఇండియా వచ్చేశారు. నటనలో శిక్షణ తీసుకుని రాటు తేలాడు. పంజా, బలుపు, రన్ రాజా రన్, బాహుబలి వంటి చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలతో ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో క్షణం, ఊపిరి, అమీతుమీ, గూఢచారి, ఎవరు, హిట్ 2, మేజర్ సినిమాలు తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చాయి. క్షణం, గూఢచారి, మేజర్ సినిమాలకు రైటర్‌గానూ పనిచేశారు అడివి శేష్.

Adivi Sesh Reveals Shocking Incident with Anushka Shetty During Baahubali Shoot

ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్. షానీ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెకాయిట్‌లో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మారీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అడివి శేష్,సునీల్ డియోలు ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 10న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్‌గా డెకాయిట్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమ కనకాలతో జరిగిన చిట్‌చాట్‌లో అడివి శేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బాహుబలి సినిమా సమయంలో చోటు చేసుకున్న ఘటనలను సుమ కనకాల ప్రశ్నించారు. కారాగారంలో ఉన్న అనుష్కని భళ్లాలదేవుడి కొడుకుగా ఉన్న అడివి శేష్ లేపే వీడియోను చూపిస్తుంది. దీనికి అడివి శేష్ స్పందిస్తూ.. బాహుబలి షూటింగ్‌లో నా పాత్ర ముగిసే దశలో ఈ సీన్ తీశామని చెప్పాడు. ఇంత సీరియస్‌ సీన్ జరిగిన తర్వాత అనుష్క, నువ్వు ఏం మాట్లాడుకున్నావని సుమ అడగ్గా.. స్వీటీ పేరులోనే కాదు స్వీటెస్ట్ పర్సన్. ఈ సీన్ అయిపోగానే ఆమె దగ్గరికి వెళ్లి ఏం తగల్లేదు కదా అని అడిగా. ఎందుకంటే బల్లెంతో గట్టిగా ఆమె మెడ మీద కొట్టా. నేను కాలు పెట్టి తన్నే సీన్ ఉంది.. షూట్ సమయంలో మెడ దగ్గర అనుష్కకి గాయమైందని అడివిశేష్ అన్నారు.

అనుష్కని కాలుతో తన్నడానికి భయం భయంగా చేశా. అయితే రాజమౌళి సార్ మాత్రం ఆ పవర్ కనిపించడం లేదు, ఆ ఫీల్ రావడం లేదన్నారు. దాంతో నేను బలంగా అనుష్కని కొట్టాల్సి రావడంతో ఆమెకు దెబ్బ తగిలింది. ఆ రోజు నుంచి అనుష్కతో సీన్ చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని.. షూట్ అయిన వెంటనే ఏం కాలేదు కదా? బాగానే ఉంది కదా అని అడిగేవాడిని. అంత బలంగా గాయం తగిలినప్పటికీ అనుష్క ఏమాత్రం బాధపడలేదని, సీన్ బాగా వచ్చిందా? లేదా అన్నది మాత్రమే ఆలోచించిందని అడివి శేష్ చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వృత్తిపట్ల అనుష్క అంకితభావాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X