Dacoit: రిలీజ్‌కు ముందు డెకాయిట్‌కు బిగ్‌షాక్.. అడివి శేష్ మూవీకి షోలపై ట్విస్ట్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ డెకాయిట్. వేసవి కానుకగా ఏప్రిల్ 10వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్‌లు, ప్రమోషనల్ కార్యక్రమాలకు తోడు మేజర్ తర్వాత అడివి శేష్ నటిస్తోన్న మూవీ కావడంతో డెకాయిట్‌పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు డెకాయిట్ టీమ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెకాయిట్‌లో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మారీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అడివి శేష్, షానీల్ డియోలు ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

హైప్‌కు తగినట్లుగానే డెకాయిట్ మూవీ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్‌లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లు ఏఎంబీ సినిమాస్, ప్రసాద్ పీసీఎక్స్‌లో సేల్ ఔట్ స్టేటస్ కనిపిస్తోంది. బుక్ మై షోలో డెకాయిట్ మూవీకి ఏప్రిల్ 8వ తేదీ ఉదయం వరకు 8,270 టికెట్లు సేల్ అయ్యాయట. అలాగే ఈ సినిమాకు 67000 యూజర్ ఇంట్రెస్ట్స్ నమోదయ్యాయి. ఇండియాలో డెకాయిట్‌కు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా తొలిరోజున ఏకంగా 2.6 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. ఓవర్సీస్‌లోనూ డెకాయిట్ ప్రీమియర్స్‌కు అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. అమెరికాలో ఇప్పటి వరకు 339 సెంటర్స్‌లో 659 షోలకు గాను 9044 టికెట్లు అమ్ముడై.. 145,634 డాలర్లు (1.34 కోట్ల రూపాయలు) రాబట్టింది. అయితే కడపటి వార్తలు అందేసరికి డెకాయిట్‌కు యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రీ సేల్స్‌లో 150K డాలర్లు (1.38 కోట్ల రూపాయలు) వసూలైనట్లుగా ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు.
కాగా.. గత కొంతకాలంగా చిన్నా పెద్దా సినిమాలన్నీ రిలీజ్‌కు ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నాయి. తొలుత అమెరికా సహా ఇతర ఓవర్సీస్ మార్కెట్‌లకే పరిమితమైన ఈ విధానం ఇండియాకి కూడా పాకింది. ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకుని హైప్ పెంచాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగా డెకాయిట్‌కు కూడా ప్రీమియర్స్ ప్రదర్శిస్తారని అనుకున్నారు. కానీ ఇక్కడే చిత్ర యూనిట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. డెకాయిట్‌కు ప్రీమియర్స్ షోలు లేవని అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డెకాయిట్ షోలు ప్రదర్శితమవుతాయని అడివి శేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారగా.. కంటెంట్‌పై డెకాయిట్ టీమ్ నమ్మకానికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications
















