Major: మళ్లీ మారిన మేజర్ విడుదల తేదీ.. కొత్త డేట్ ప్రకటించిన మహేశ్ బాబు
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన టాలెంట్లతో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విలన్ పాత్రలతో కెరీర్‌ను ఆరంభించిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆ తర్వాత సోలో హీరోగా మారాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో అడవి శేష్ వరుసగా హిట్లు మీద హిట్లను అందకుంటున్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకెళ్తున్నాడు.
విజయాల పరంపరతో ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ స్టార్ హీరో అడవి శేష్ ప్రస్తుతం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' అనే సినిమా చేస్తున్నాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా రేంజ్‌ను మరింతగా పెంచేశాయి. ఫలితంగా ఈ మూవీ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

అడవి శేష్ నటిస్తోన్న 'మేజర్' సినిమా షూటింగ్ చాలా నెలల క్రితమే ప్రారంభం అయింది. దీంతో అప్పుడు దీన్ని గత ఏడాదిలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, కరోనా ప్రభావంతో పాటు పలు అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఎన్నో సార్లు బ్రేక్ పడింది. దీంతో అనుకున్న సమయానికి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించి చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. దీంతో ఈ సారైనా అనుకున్న టైమ్‌కే దీన్ని విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి.

పూర్తి స్థాయి ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'మేజర్' మూవీని మే 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, అప్పటికి ఈ మూవీ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో పాటు కొన్ని అనివార్య కారణాలతో దీన్ని మళ్లీ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో 'మేజర్' సినిమాను జూన్ 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు చిత్ర నిర్మాతల్లో ఒకరైన టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు కొత్త రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్లను తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేశాడు. దీంతో అడవి శేష్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మేజర్' మూవీ కోసం అడవి శేష్ ఎంతగానో కష్ట పడ్డాడు. ఈ సినిమాకు కథా సహకారం కూడా అందించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











