Major Release Date: మేజర్ నుంచి అదిరిపోయే ప్రకటన.. ఆరోజే మూవీ రిలీజ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును అందుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ యంగ్ స్టార్ అడవి శేష్ ఒకడు. విలన్ పాత్రలతో సినీ కెరీర్‌ను ఆరంభించిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో అడవి శేష్ వరుసగా హిట్లు మీద హిట్లను ఖాతాలో వేసుకుంటున్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ముందుకెళ్తున్నాడు.

కొంత కాలంగా వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అడవి శేష్ ప్రస్తుతం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' అనే సినిమా చేస్తున్నాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇక, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా రేంజ్‌ను మరింతగా పెంచేశాయి. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించేసింది.

Adivi Seshs Major Movie Release on May 27th

వాస్తవానికి 'మేజర్' సినిమా షూటింగ్ చాలా నెలల క్రితమే ప్రారంభం అయింది.అప్పుడు దీన్ని గత ఏడాదిలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, కరోనా ప్రభావంతో పాటు పలు అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ సజావుగా సాగలేదు. దీంతో అనుకున్న టైంకు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. ఇలా షూటింగ్ పార్ట్‌ను దాదాపుగా పూర్తి చేసేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

కరోనా వల్ల కొద్ది రోజులుగా వాయిదా పడుతోన్న సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లను ఒక్కొక్కటిగా అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'మేజర్' మూవీ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీన్ని మే 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన హీరో అడవి శేష్ 'ఈ వేసవి మరింత భారీగా ఉండబోతుంది. మేజర్ మే 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇది మేజర్ చేసిన ప్రామిస్' అంటూ పోస్ట్ చేశాడు. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మేజర్' మూవీ కోసం అడవి శేష్ ఎంతగానో కష్ట పడుతున్నాడు. ఈ సినిమాకు కథా సహకారం కూడా అందించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X