Major: స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన అడివి శేష్.. ఆరోజే అసలైన సర్‌ప్రైజ్ అని పోస్ట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ హీరోలు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే విలక్షణమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. అందులో టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ ఒకడు. విలన్ పాత్రలతో సినీ కెరీర్‌ను ఆరంభించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారి ఆరంభంలోనే సక్సెస్‌లను ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో అడివి శేష్ యమ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ముందుకెళ్తున్నాడు.
ఈ మధ్య కాలంలో హిట్ల మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న అడవి శేష్ ప్రస్తుతం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' అనే సినిమా చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇక, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా రేంజ్‌ను మరింతగా పెంచేశాయి. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు బజ్‌ను ఏర్పరచుకుంటోంది.

నిజానికి 'మేజర్' సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. అందుకు అనుగుణంగానే అప్పుడు దీన్ని గత ఏడాదిలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, కరోనా ప్రభావంతో పాటు పలు అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ చాలా బ్రేకులతో సాగింది. దీంతో అనుకున్న టైంకు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా చిత్రీకరణ జరుపుతూ ఇటీవలే టాకీ పార్ట్‌ను దాదాపుగా పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా షురూ చేసేసింది చిత్ర యూనిట్.
'మేజర్' సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను విభిన్నంగా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు అప్‌డేట్లు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారు. ఈ మేరకు తాజాగా హీరో అడివి శేష్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 'మార్చి 15 మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి. ఈ లెజెండ్ జయంతిని పురస్కరించుకుని ఓ స్పెషల్ ప్లాన్ చేశాం' అని చెప్పుకొచ్చాడు. దీంతో అది ఏమై ఉంటుందా అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు కూడా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మేజర్' మూవీ కోసం అడవి శేష్ ఎంతగానో కష్ట పడుతున్నాడు. ఈ సినిమాకు కథా సహకారం కూడా అందించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











