For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HIT 2 Trailer: అడివి శేష్ ను భయపెట్టిన కోడి బుర్ర కిల్లర్.. ట్రైలర్ లోనే ఊహించని ట్విస్ట్

  |

  2020లో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో నాని నిర్మించిన ఆ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు ఫ్రాంఛైజ్ గా హిట్ 2 ద సెకండ్ కేస్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  అడవి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ట్రైలర్లోనే దర్శకుడు ఊహించిన ట్విస్ట్ లను హైలెట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

   కోడి బుర్రలు

  కోడి బుర్రలు

  సంజన అనే ఒక అమ్మాయి మర్డర్ కేసుతో మొదలైన ఈ ట్రైలర్లో అడవి శేష్ ఊహించని విధంగా కిల్లర్ ను తక్కువ అంచనా వేసినట్లు మాట్లాడిన విధానం కొత్తగా ఉంది. క్రిమినల్స్ అనేవాళ్ళు డంప్స్.. కోడి బుర్రలు ఐదు నిమిషాలు చాలు వీళ్లను పట్టుకోవడానికి అని చాలా తేలిగ్గా మీడియా ముందు చెప్పేసాడు. అయితే ఆ మాటలకు కిల్లర్ ఊహించిన విధంగా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చినట్లు ట్రైలర్ లో అర్థమైంది.

  అమ్మాయి హత్య

  అమ్మాయి హత్య

  ఇక తనికెళ్ల భరణి ఒక తండ్రిగా కనిపిస్తుండగా అతని కూతురిని ఎవరో నరికేసినట్లు కేసు నమోదు అవుతుంది. ఇక హత్య చేయబడిన సంజన కేసును ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ గా అడివి శేష్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అలాగే అతనికి తోడుగా ఉన్నటువంటి మరి కొంతమంది ఆఫీసర్లు ఎలాంటి ఐడియాలు ఇచ్చారు అనేది ట్రైలర్లో హైలెట్గా నిలిచింది. అలాగే అతని పెంపుడు కుక్క కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది.

  సంజన ఎవరు?

  సంజన ఎవరు?

  ఇక సంజన అనే అమ్మాయిని ఎవరు చంపారు అనే విషయంలో అడివి శేష్ హీరోగా విభిన్నమైన కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తీరు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఉన్నతాధికారిగా ఉన్న వారు ఈ కేసును అనవసరంగా తలనొప్పిగా తీసుకోవద్దు అని చెప్పినప్పటికీ అడవి శేష్ ఏ మాత్రం వదిలిపెట్టడం లేదు అనిపిస్తోంది. ఇక చనిపోయిన సంజన ఎవరు అసలు ఆమెను అత్యంత కిరాతకంగా ఎందుకు నరికారు? ఇక ఆమె కోసం జనాలు ఎందుకు రోడ్లపై ఎక్కి న్యాయం కావాలి అని కోరుకుంటారు? అనేది కూడా ఈ సినిమాలో హైలైట్ గా నిలవబోతున్నట్లు అనిపిస్తుంది.

  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది

  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది

  ఈ సినిమాకు జాన్ స్టీవర్ట్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ప్రతి సీన్ కూడా హైలైట్ అయ్యే విధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక సినిమాటోగ్రాఫర్ మణికందన్ కూడా అద్భుతమైన పనితనంతో మెప్పించాడు అని తెలుస్తోంది. కంటెంట్ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉండబోతున్నట్లుగా ట్రైలర్ తోనే దర్శకుడు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు.

  ట్రైలర్ లోనే ట్విస్ట్

  మొదట కేవలం ఒకే అమ్మాయిని చంపారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ హంతకుడు చాలామంది అమ్మాయిలను చంపుతున్నాడు అని అర్థమవుతుంది. ఇక శేష్ కు పోటీగా ఆ కిల్లర్ అద్దం మీద కోడి బుర్ర అని డేంజర్ అలర్ట్ ఇవ్వడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. కేవలం అతను సంజనను మాత్రమే చంపలేదు తల మాత్రమే సంజనది, చేతుకు మొండెం కాళ్లు వేరే వేరే అమ్మాయిలవి అని ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మరి అలాంటి భయంకరమైన కిల్లర్ ను హీరో ఎలా పట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాలి.

  English summary
  Adivi sesh upcoming movie Hit 2 telugu review
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X