మేజర్ సినిమా కోసం రెడీ.. వర్కౌట్లతో అడివి శేష్ బిజీ!
క్షణం, గూఢాచారి, ఎవరు వంటి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నాడు అడివి శేష్. తెలుగు సినిమాల్లో కొత్తదనం కోసం ట్రై చేసే హీరోల్లో అడివి శేష్ ముందున్నాడు. హాలీవుడ్ లెవెల్‌లో మన కథలను కూడా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ మీద ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. అడివి శేష్ చిత్రం వస్తుందంటే అందులో ఏదో ఒక కొత్త పాయింట్, కొత్త కాన్సెప్ట్ ఉంటుందని ఉండాలని ఆశిస్తున్నారు. అడివి శేష్ ప్రస్తుతం మేజర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
లాక్డౌన్ తరువాత మళ్లీ చాలా గ్యాప్ తీసుకున్న అడివి శేష్ మేజర్ సినిమాకు తగ్గట్టు తన బాడీని మార్చేసుకుంటున్నాడు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశారు. అందులో అడివి శేష్ జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. లాక్డౌన్ వల్ల వచ్చిన మార్పులను ఇప్పుడు మేజర్ కోసం మళ్లీ కరిగించేస్తున్నాడు. శరీరాకృతిని మార్చుకునే పనిలో పడ్డ అడివి శేష్ మేజర్ షూటింగ్ సెట్‌లో త్వరలోనే అడుగు పెట్టబోతోన్నట్టు తెలుస్తోంది.

లాంగ్ గ్యాప్ తరువాత మేజర్ షూటింగ్ మళ్లీ పున: ప్రారంభం కానుంది. ఈ మూవీని మహేష్ బాబు తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబై బాంబ్ బ్లాస్ట్‌లో వీర మరణం పొందించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని శశి కిరణ్ తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











