యువ హీరోయిన్ దారుణ హత్య.. ప్రియుడు ముక్కలు ముక్కలుగా కోసి..
ఇటలీకి చెందిన యువతార, అడల్ట్ సినిమాలో నటించే చార్లెట్ ఏంజీ దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. అతికిరాతకంగా హత్య చేసిన ఘటన సినీవర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. మిలన్ నగరంలో చోటుచేసుకొన్న ఈ దారుణ ఘటనలో బ్యాంకింగ్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం మరింత సంచలనం రేపింది. ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

యువ హీరోయిన్ అదృశ్యం కావడంతో
ఛార్లెట్ ఏంజీ మార్చి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు లక్సీ క్లబ్ మిలానాలోని లక్సీ ఎరోటిక్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ ఆమె ఈ వేడుకకు హాజరుకాకపోవడంపై అనేక అనుమానాలు అభిమానులకు తలెత్తాయి. దాంతో పోలీసులకు, కోర్టును, మీడియాకు ఈ విషయాన్ని అందజేశారు. అయితే ఓ అభిమాని ఇచ్చిన ఆధారాల ప్రకారం.. యువతార చేతిపై ఉండే పచ్చబొట్టు వివరాల ఆధారంగా ఆమెను గుర్తించారు.

బ్యాంకర్ అరెస్టుతో
చార్లెట్ ఏంజీ హత్యా ఘటనలో డేవిడ్ ఫంటానా అనే ప్రొఫెషనల్ బ్యాంకర్, ఫుడ్ బ్లాగర్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారించిన పోలీసులు నిందితుడిపై హత్యకేసు నమోదు చేశారు. అలాగే సాక్ష్యాలను రూపుమాపేందుకు కుట్రపన్నారంటూ అతడిపై తీవ్ర అభియోగాలు మోపారు.

చంపి.. ఫ్రిజ్‌లో దాచిపెట్టి
మిలాన్ పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏంజీని జనవరిలో చంపి వేశాడు. ఆమె శరీరాన్ని ఫ్రీజర్‌లో దాచిపెట్టాడు. నెల రోజుల పాటు శవాన్ని దాచిపెట్టి ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ముక్కలను మంటలో బూడిద చేశాడు. ఆమెను భారీ సుత్తితో చనిపోయే వరకు కొట్టి చంపాడు అని పోలీసులు మీడియాకు వెల్లడించారు.

బాధితురాలి ఫోన్ ఉపయోగిస్తూ..
చార్లెట్ ఏంజీని హత్య చేసిన తర్వాత ఆమె ఫోన్‌ను నిందితుడు తన వద్ద ఉంచుకొన్నాడు. ఏంజీకి మెసేజ్ పంపే ప్రతీ వ్యక్తికి సమాధానాలు ఇచ్చాడు. మెసేజ్ వచ్చే ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశాడు. అయితే ఫంటానా ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించగా.. ఓ అందమైన యువతి వచ్చి పోతు ఉండేది. ఏంజీ కూడా ఆయన ఇంటికి చేరువలోనే ఉండేది.

ఛార్లెట్ ఏంజీ వ్యక్తిగత జీవితం గురించి
ఛార్లెట్ ఎంజీ జీవితం విషయానికి వస్తే.. మిలాన్ లోని లాండోర్డీ మెట్రోపాలిటన్ సిటీలోని రెస్కాల్డినాలో నివసించేది. కోవిడ్ కారణంగా అవకాశాలు లేకపోవడంతో కెరీర్ మార్చుకొన్నది. తొలుత సేల్స్ ఉమెన్‌గా పనిచేసేది. ఆ తర్వాత పోర్నోగ్రాఫిక్ కంటెంట్ రంగంలోకి ప్రవేశించింది. పోర్నో వీడియోలో నటిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నది అని ఆమె సన్నిహితులు తెలిపారు.


Click it and Unblock the Notifications











