‘రాజ్ తరుణ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదు.. మీడియా ముందు పక్కా సాక్ష్యాలతో’
చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుుంటూ హీరోగా ఎదిగారు రాజ్ తరుణ్ . మొదట్లో పలకరించిన విజయాలు తర్వాత ముఖం చాటేసినా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న దశలో వ్యక్తిగత సమస్యలు రాజ్ తరుణ్‌ను చుట్టుముట్టాయి. లావణ్య అనే యువతి తాను , రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నామని.. 11 ఏళ్లుగా కలిసే ఉంటున్నామని తీరా ఇప్పుడు తనను దూరం పెట్టి మరో అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.
హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ట్రాప్‌లో రాజ్ తరుణ్ పడ్డారని.. అతనిని వదిలివేయమని అడిగితే ఆమె, తన సోదరుడు కలిసి తనను బెదిరిస్తున్నారని హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మాల్వీ వాళ్ల నాన్నకు హిమాచల్ ప్రదేశ్ సీఎం క్లోజ్ ఫ్రెండ్ అని.. వారితో పెట్టుకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. రాజ్‌తరుణ్‌ని వదిలేయాలని, ఇందుకు కొంత డబ్బు ఇస్తామని .. లేదంటే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారని లావణ్య ఆరోపించింది.

తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే హీరో రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్య తనకు ఎప్పటి నుంచో తెలుసునని, ఇద్దరం కలిసి సహజీవనం చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. 2017 వరకు లావణ్యతో రిలేషన్‌లో ఉన్నానని.. కానీ తర్వాత ఆమె డ్రగ్స్‌కు బానిస అయ్యిందని దాంతో దూరం పెట్టినట్లు రాజ్ తరుణ్ చెప్పారు. తనకు, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. లావణ్య తనకు ఎంతో చేసిందని దీనికి తాను కృతజ్ఞతగా ఉంటానని రాజ్ తరుణ్ చెప్పారు. ఆమె తీరు నచ్చక ఫ్లాట్ ఖాళీ చేయమని చెప్పానని.. దీంతో తనను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఆవిడ మస్తాన్ అనే వ్యక్తితో కలిసి తిరుగుతోందన్నారు. మరోవైపు.. మాల్వీ కూడా మీడియా ముందుకు వచ్చి లావణ్య ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు.
రాజ్‌తరుణ్ తనకు ఫ్రెండ్ మాత్రమేనని.. అతనితో ఆరు నెలలుగా మాట్లాడలేదని స్పష్టం చేసింది. రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన వారిని లావణ్య వేధిస్తోందని.. తనకు కూడా ఫోన్లు , మెసేజ్ చేస్తోందని మాల్వీ తెలిపింది. తన పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడినందుకు గాను ఆమె హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో లావణ్యపై ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఆధారాలు సమర్పించాల్సిందిగా నార్సింగి పోలీసులు లావణ్యకు నోటీసులు జారీ చేశారు.

ఇదిలావుండగా.. ఇవాళ రాజ్ తరుణ్‌పై లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరం కలిసి కాపురం చేశామని .. తాను గర్భం దాల్చితే అతనే అబార్షన్ చేయించాడని ఆరోపించింది. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు, దాదాపుప 170 ఫోటోలను తీసుకుని నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర.. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించారు.
రాజ్ తరుణ్‌పై 420, 493, 506 కింద కేసు నమోదైందని .. పోలీసులు వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, ఆధారాలు పరిశీలించాకే కేసు నమోదు చేశారని దిలీప్ చెప్పారు. వాట్సాప్ ఛాటింగ్‌లో లావణ్యను రాజ్ తరుణ్ బూతులు తిట్టాడని.. ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టేందుకు తన చేతిని తానే కాల్చుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ తరుణ్‌ను రేపో మాపో స్టేషన్‌కు పిలుస్తారు అని లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు.
లావణ్య బూతులు తిడుతోందని చాలా ఛానెల్స్‌లో వైరల్ చేశారని దీని వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉందని దిలీప్ అన్నారు. అమ్మాయిని చిత్రహింసలు పెడుతుంటే తిరగబడకుండా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. గురువారం ఉదయం పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. ఈ వరుస ట్విస్టులతో రాజ్ తరుణ్ కేసు ఎటు తిరుగుతుందోనని ప్రజలు, సినీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











