ఒక్క రూపాయికే ఏవమ్ జగత్.. చిన్న సినిమాకు అండగా నిలిచిన జేడీ లక్ష్మీనారాయణ
కరోనావైరస్ రోజు రోజుకు విజృంభిస్తూ సినిమా పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టింది. చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడమనేది చాలా కష్టంగా మారింది. రైతుల సమస్యలు, ప్రస్తుత సమాజంలో రైతులు పడుతున్న బాధలను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నాన్ని ఏవమ్ జగత్ అనే చిత్రం ద్వారా దర్శకుడు దినేష్ నర్రా చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయడం కష్టంగా మారడంతో దర్శక, నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఒక్క రూపాయికే యూట్యూబ్ ( https://aevumjagat.com/) లో సినిమా చూసే వెసలుబాటును ప్రేక్షకులకు కల్పించారు.
ప్రముఖ రచయిత ఎల్‌బీ శ్రీరామ్ శిష్యుడైన దినేష్ నర్రా ఏవమ్ జగత్ చిత్రాన్ని ఎంతో వైవిధ్యంగా మలిచి ప్రేక్షకుల ముందుంచారు. ఆదివారం రోజు మదనపల్లె మండలం కొత్తవారి పల్లె పంచాయతీలో ఎంసీవీ ప్రసాద్ ఏర్పాటు చేసిన ప్రకృతివనంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన రచయిత ఎల్‌బీ శ్రీరామ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ 'ఏవమ్ జగత్' సినిమాకు మంచి ఆదరణ లభించి అద్భుత విజయం సాధించాలని కోరుకున్నారు.

ప్రకృతివనం వ్యవస్థాపకులు ప్రసాద్, డైరెక్టర్ దినేష్ నర్రా మాట్లాడుతూ.. ప్రకృతి సేద్యంపై రైతుల దృష్టి మారాలని, వ్యవసాయంలో తీసుకురావాల్సిన మార్పులపై అవగాహన కల్పిస్తూ ఈ సినిమా రూపొందించామని అన్నారు. ఈ చిత్రాన్ని ఒకే ఒక్క రూపాయితో గూగుల్ ద్వారా ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో చూడొచ్చని తెలిపారు. ప్రతి ఒక్క పేద రైతుకు అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఓ విలేజ్ కుర్రాడి ఆశ, ఆశయాలను ప్రధాన భూమికగా తీసుకొని అన్ని వర్గాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ ప్రేరణ పొందేలా 'ఏవమ్ జగత్' సినిమా రూపొందించారని ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ ద్వారా అర్థమైంది. ఈ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కింది. కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాను మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. పూర్తి పల్లెటూరు వాతావరణంలో అందమైన పల్లెటూరు అందాల్లో చిత్రీకరించిన ఈ సినిమాకు ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ప్రముఖ రాజకీయ వేత్త జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ''ఏవమ్ జగత్ అనే సినిమా వ్యవసాయ ఆధారితంగా రూపొందించి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను మానవాళికి వివరించే విధంగా తెరకెక్కించారు. ఎందుకు విద్యార్థులు వ్యవసాయం గురించి చదవాలి? వ్యవసాయ రంగంలో యువత ఎందుకు ప్రవేశించాలి అనే కోణంలో తీసిన సందేశాత్మక సినిమా ఇది తెలిసి చాలా సంతోషించా. ప్రస్తుతం వ్యవసాయం అంటే చదువుకున్న వాళ్ళ పనికాదు అని సమాజంలో ఓ అభిప్రాయం పాతుకుపోయింది. ఇలాంటి ఆలోచనలే కొనసాగితే రాబోయే కాలంలో మన ఫుడ్ సెక్యూరిటీకి అఘాదం కలుగుతుందని నా అభిప్రాయం. సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ తీసిన ఈ 'ఏవమ్ జగత్' సినిమా గొప్ప విజయం సాధించాలని, ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ సినిమాను క్రింది లింక్ క్లిక్ చేసి కేవలం ఒకేఒక్క రూపాయితో చూసేయండి.. https://aevumjagat.com/
నటీనటులు: కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు
సంగీతం: శివ కుమార్
సినిమాటోగ్రఫి: వెంకీ అల్ల,
ఎడిటింగ్: నిశాంత్ చిటుమోతు,
ఆర్ట్: సదావంశీ
ప్రొడక్షన్ మేనేజర్: అభినవ్ అవునూరి,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: మోహన్ కృష్ణ, సంపూర్ణమ్మ, స్కంద ఆముదాల
క్వాలిటీ హెడ్: సిద్దార్థ కండల
నిర్మాతలు: ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్,
రచన దర్శకత్వం: దినేష్ నర్రా


Click it and Unblock the Notifications











