14 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు A సర్టిఫికెట్.. చివరిగా ఏ మూవీకి వచ్చిందో తెలుసా?
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం OG. ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. భారీ గ్యాంగ్ స్టార్ ఫిల్మ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్కరోజులో OG చిత్రం వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఇండియా ఫిలీంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా నడుస్తుంది.
ఇక పవన్ కళ్యాణ్ OG చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ కూడా అందింది. సెన్సార్ కమిటీ సభ్యులు ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ను కూడా అందించిన సంగతి తెలిసిందే. అయితే OG చిత్రంలో టూ మచ్ వైలెన్స్ సీన్లు ఉండడం, రక్తపాతం వంటి సన్నివేశాలు ఉండడం కారణంగా ఈ చిత్రాన్ని కేవలం అడల్ట్స్ మాత్రమే చూడాలని సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిన సీన్లను తొలగిస్తే U/A సర్టిఫికెట్‌ను అందిస్తామని సూచించారు.

కానీ OG మేకర్స్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దాంతో చేసేదేమీ లేక సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇటీవల కాలంలో ఇలాంటి సర్టిఫికెట్ వచ్చింది లేదు. ఆ తరహా చిత్రాలు మాత్రమే పవన్ కళ్యాణ్ చేశారు. అయితే 14 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రానికి A సర్టిఫికెట్ అందింది. ఇక చివరిగా 2011లో ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ తన చిత్రానికి గాను A సర్టిఫికెట్‌ను అందుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా నటించిన పంజా చిత్రం కూడా A సర్టిఫికెట్‌ను అందుకుంది. ఈ చిత్రంలోనూ గన్స్, వయలెన్స్, రక్తపాతం ఉండడంతో అప్పుడు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ను అందించింది. ఆ చిత్రానికి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం కూడా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ 33 కోట్ల రూపాయల బడ్జెట్ తో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. దీంతో థియేట్రికల్ గా, బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది.
ఇపుడు OG చిత్రం మాత్రం తారాస్థాయి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పవన్ కళ్యాణ్ లుక్, యాక్షన్, భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్ తోపాటు అదిరిపోయే బీజీఎంతో THEY CALL HIM OG చిత్రం రిలీజ్ కు ముందే బ్లాక్ బాస్టర్ వైబ్ ను క్రియేట్ చేసింది. ఇక సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని డీడీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మాత డీవీవీ దానయ్య రూ.250 కోట్లతో నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











