బ్లాక్ బాస్టర్ కాంబో.. 20 ఏళ్లకు ఆ దర్శకుడితో వెంకీ సినిమా.. ఎవరాయన?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్నారు. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ తరం ఆడియెన్స్ ను కూడా ఆకర్షించేలా విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ గా చేసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. థియేటర్లలో సందడి చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుటున్నారు.

రీసెంట్ గా వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. 2025 సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా వెంకీ మామ కాసుల వర్షం కురిపించారు. ఏకంగా ఈ సినిమాకు రూ.300 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. సంక్రాంతికి వచ్చిన చిత్రాల్లో టాప్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది.

After 20 Years of Planning finally Venkatesh Teaming up with that Director for his next

భారీ సక్సెస్ తర్వాత ఇక నెక్ట్స్ వెంకటేష్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికంగా మారింది. అయితే ఓవైపు మెగా స్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దు కోబోతున్న మెగా 157లో వెంకీ కూడా కామియో అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారని గాసిప్ అయితే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇక వెంకటేశ్ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ తో మళ్లీ రీయూనైట్ కాబోతున్నారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే గుస గుసలు వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

మరీ ఆ దర్శకుడు ఎవరో కాదు... మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కావడం విశేషం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి విక్టరీ వెంకటేశ్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. అయితే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. నెక్ట్స్ కూడా అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి చాలా సమయం ఉంది. ఈలోగా ఒక సినిమా పూర్తై విడుదల కూడా అవుతుంది.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ 20 ఏళ్ల నుంచి వెంకటేశ్ తో కలిసి సినిమా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారంట. పలు సందర్భాల్లో ప్లాన్ చేసినా కుదరలేదంట. ఇక అల్లు అర్జున్ వల్ల త్రివిక్రమ్ కు కాస్తా గ్యాప్ రావడంతో ఆ కోరికను పూర్తి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి వీరి కాంబో ఫిక్స్ అయ్యిందని స్ట్రాంగ్ సమాచారం. ఫ్యామిలీ డ్రామాతో సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చివరిగా త్రివిక్రమ్ 'గుంటూరు కారం' చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ వెంకీ కాంబినేషన్ అనగానే ఆ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు మొదలవుతున్నాయి. అయితే వెంకీ కామెడీ టైమింగ్, ఎమోషనల్ యాక్టింగ్, పైగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో కావడంతో ఎలాంటి సినిమా ను తీసుకువస్తారనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X