21 ఏళ్ల తర్వాత తెరపైకి సౌందర్య డెత్ మిస్టరీగా.. మోహన్ బాబే టార్గెట్ ఎందుకు?
సినీ నటి, టాలెంటెడ్ యాక్టర్ సౌందర్య ఆకస్మిక మరణం అందర్నీ తీవ్ర దిగ్బాంతికి గురి చేసింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించడం అందర్నీ కలిచిపోయింది. 2004 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ఆమె బెంగళూరు నుంచి కరీంనగర్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తూ హెలికాప్టర్ కూలడం ద్వారా ఆమె మృత్యువాత పడటం సినీ లోకాన్ని విషాదంలో ముంచెత్తింది.
అయితే సినీ రంగానికి ఆమె భౌతికంగా దూరమైనప్పటికీ. ఆమె మెమొరీస్ ఏదో ఒక రూపంలో అభిమానులను వెంటాడుతుంటాయి. అయితే తాజాగా ఆమె మరణం అనూహ్యంగా మరో విధంగా తెరపైకి వచ్చి..మోహన్ బాబును టార్గెట్ చేయడం అందర్నీ విస్మయానికి గురి చేస్తున్నది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు తెలుగు సినిమా దిగ్గజ నటుడు మోహన్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. సినీ నటి, స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది. ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగారు. అందుకు సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారు. అయితే ఆ కారణంగా ఆ భూమిని సొంతం చేసుకొనేందుకు వారిని ప్రమాదం రూపంలో హత్య చేశారు అనే విధంగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే గత కొద్దికాలంగా మోహన్ బాబు కుటుంబంలో ఇద్దరు కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు, ఆస్తుల విషయంలో తగదాలు రావడం, పోలీసుల కేసుల వరకు వెళ్లాయి. తండ్రి మోహన్ బాబుపై మనోజ్, మనోజ్‌పై మంచు విష్ణు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ తగాదాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వివాదం భారీ చర్చకు దారి తీసింది. అయితే కొడుకులు పోరు మధ్య కుటుంబం, తండ్రి మోహన్ బాబు పరువు ప్రతిష్టలు బజారుకెక్కాయి.
ఇది ఇలా ఉండగా, సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియాలో మోహన్ బాబు, సౌందర్య గురించి కొన్ని కథలు వెలుగు చూశాయి. శంషాబాద్‌కు సమీపంలోని జల్ పల్లి గ్రామంలో సౌందర్య భూమిని మోహన్ బాబు కాజేశాడు. ఆమె మరణం తర్వాత ఆ ల్యాండ్‌ను ఆక్రమించాడు. సౌందర్య కుటుంబానికి చేసిన ద్రోహం వల్లే ఆయన కుటుంబంలో కలతలు రేగగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి అనే విషయాన్ని యూట్యూబ్ కథనాల్లో వినిపించాయి.
అంతేకాకుండా మోహన్ బాబు జల్ పల్లి నివాసం వద్ద సౌందర్య ఆత్మకూడా తిరుగుతున్నది. ఆమె ఆత్మ చేస్తున్న పనుల వల్లే మోహన్ బాబు కుటుంబానికి ఓ శాపంలా మారాయి అని ఓ వింతడవాదం సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో వినిపించాయి. అయితే సౌందర్య ఆత్మ విషయాన్ని చాలా ఫన్నీగా తీసుకొన్నారు. మోహన్ బాబు కుటుంబానికి కీడు చేయాలనుకొంటే సౌందర్య ఆత్మ 21 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసిందనే వింత వాదనను మోహన్ బాబు వర్గం తెరపైకి తెచ్చారు.
అయితే వాదనలు, వింతడవాదాలు పక్కన పెడితే.. ఖమ్మం జిల్లా వాసి గత కొద్ది రోజులుగా నిరసన దీక్ష, ఉపవాస దీక్ష చేపట్టడం అందరికి అంతు చిక్కని విషయంగా మారింది. ఏ సంబంధం లేని ఆయన ఈ దీక్ష ఎందుకు చేపట్టాడు? ఖమ్మం జిల్లా కలెక్టర్, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు? ఆయన ఫిర్యాదుపై పోలీసులు, అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకొంటున్నారనే విషయం ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ఈ వివాదంపై అటు మోహన్ బాబు వర్గం, అధికారులు మౌనంగా ఉండటం మరింత ఆశ్చర్యంగా మారింది.


Click it and Unblock the Notifications











