40 సంవత్సరాలుగా విడుదలకు నోచుకోలేని ఏఎన్నార్ సినిమా.. ఇన్నాళ్ళకు థియేట్రికల్ రిలీజ్
అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రతిబింబాలు అనే సినిమా గత 40 ఏళ్ళుగా వివిధ కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. ఇక మొత్తానికి ఇన్నాళ్లకు ఈ సినిమాను విడుదల చేయడానికి పరిస్థితులు అనుకూలించడంతో చిత్ర నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. ఇక నవంబర్ 5న 250 థియేటర్స్ లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మీడియాతో మాట్లాడారు.
రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో విష్ణు ప్రియ సినీ కంబైన్స్ బ్యానర్ లో అక్కినేని నాగేశ్వరావు, జయసుధ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను కీ. శే.కె. యస్. ప్రకాషరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. "ప్రతిబింబాలు" అనే ఈ సినిమా గత 40 సంవత్సరాల తర్వాత విడుదల చేస్తుండడం ఆనందంగా ఉందని నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి వివరణ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రాధాకృష్ణ మూర్తి ఎంతో ధైర్యం చేసి వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని అన్నారు. అలాగే ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో కొనసాగలి అని కోరుకున్నారు.

చిత్ర నిర్మాత జాగర్లమూడి మాట్లాడుతూ.. నేను నిర్మించిన సినిమాలను చూసి నాగేశ్వరావు గారు నాతో సినిమా చెయ్యాలని డేట్స్ ఇచ్చాడు. ఇక 1982 లో ఈ సినిమా స్టార్ట్ చేసి ఏకాదటిగా షూట్ చేశాము. ఆయన ఇందులో డ్యూయల్ రోల్ లో నటించాడు. అయితే ఈ సినిమా కొంత షూట్ చివరలో హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన అమెరికా వెళ్ళారు. ఇక రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన నాగేశ్వరావు గారు షూటింగ్ స్టార్ట్ చేయమన్నారు. అనంతరం అంతా రెడీ చేసుకొన్నాక జయసుధ గారు ప్రెగ్నెంట్ తో ఉన్నారు. ఇక ఆమె డెలివరీ అయ్యే వరకు షూటింగ్ చెయ్యను అన్నారు.
మళ్లికొన్నాళ్లకు ఇద్దరూ డేట్స్ ఇచ్చినా డైరెక్టర్ రాలేకపోయారు. ఫైనల్ గా నాగేశ్వరావు గారే కె. యస్ ప్రకాష్ గారిని పిలిచి మిగిలిన సినిమాను డైరెక్షన్ చెయ్యమని చెప్పారు. ఆ విధంగా సినిమా పూర్తి చేశాము. ఆ తరువాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కు వెళ్లడంతో ఫైనాన్స్ పరమైన ఇబ్బందులు వచ్చాయి. ఆ తరువాత ఈ సినిమా రిలీజ్ చేయాలని 40 సంవత్సరాలనుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము ఫైనల్ గా నా సినిమా రిలీజ్ చేయకుండా చనిపోతానేమో అనుకున్న టైమ్ లో రాచర్ల రాజేశ్వర్ రావు సినిమాను విడుదల చేసేందుకు సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఈ నెల 5 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నట్లు.. నిర్మాత వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











