ముదురు హీరోతో టబు నాలుగోసారి.. అతడి ఛాయిసేనట!
అందంతోపాటు అభినయంతో ఆకట్టుకొనే సత్తా ఉన్న నటి టబు సినిమాల వేగం పెంచారు. తాజాగా ఆమె నటించిన దే దే ప్యార్ దే సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జవానీ జానేమన్ చిత్రంలో నటిస్తున్నది. అంతేకాకుండా సినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. అంతేకాకుండా పూజా బేడి కూతురు అలయియా ఎఫ్ బాలీవుడ్ ఎంట్రీ చిత్రంలో కూడా కనిపించనున్నారు.
ఇక జవానీ జానేమన్ చిత్రంలో టబు సీనియర్ హీరో సైఫ్ ఆలీ ఖాన్‌తో కలిసి నటించనున్నారు. గతంలో సైఫ్, టబు కలిసి మూడు చిత్రాల్లో కలిసి నటించారు. తు చోర్ మై సిపాయి, హమ్ సాథ్ సాథ్ హై, బీవీ నంబర్ 1 చిత్రంలో వీరిద్దరి జోడికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

జవానీ జానేమన్ చిత్రంలో టుబ పాత్ర చాలా కీలకమైనది. అయితే ఆమె ఎలాంటి పాత్రలో కనిపిస్తారనే విషయాన్ని చెప్పడానికి నిరాకరించారు. అయితే ఈ పాత్ర చాలా ముఖ్యమైంది. కాకపోతే ఇప్పుడే వెల్లడిస్తే దానిలో ఉండే మజా తర్వాత కనిపించదు. ఈ పాత్రకు సైఫ్ మొదటి చాయిస్ టబునే అని నిర్మాతలు పేర్కొన్నారు. కామెడీ ప్రధానంగా సాగే చిత్రమని వెల్లడించారు.
కాగా, ఇటీవల కాలంలో ముదురు హీరోలతో టబు నటిస్తుందనే మాట వినిపిస్తున్నది. దే దే ప్యార్ దే చిత్రంలో అజయ్ దేవగన్‌కు జంటగా నటిస్తున్నారు. అలాగే సైఫ్‌తో నాలుగోసారి జతకట్టడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











