జగన్ పై శివాజీ కాంట్రవర్సియల్ కామెంట్స్ .. 11 కాదు సింగిల్ డిజిట్ రావాలి
ఒకప్పుడు అంటే రాజకీయాలు అలాగే సినిమాలు అనేవి పూర్తిగా దేనికదే సంబంధం లేకుండా ఉండేవి అని అందరికీ తెలిసిందే. అయితే గత దశాబ్దాల కితమే సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు పార్టీలు పెట్టడం కొందరు వేరే పార్టీల తరపున పోటీలు చేయడం కూడా జరిగింది. ఇలా మెల్లమెల్లగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సహా సినిమాలు కూడా మిళితం అవ్వడం మొదలయ్యాయి.
అయితే ఇలాగని సినీ పరిశ్రమకి చెందిన వారే పార్టీలు పెడితే సినీ నటీనటులు స్టార్స్ వారికే సపోర్ట్ చేస్తారని కూడా లేదు. ఇక్కడ కూడా ఎవరి ఇష్టం వారికి నచ్చినట్టే తమ నాయకులని ఎన్నుకుంటున్నారు. కాగా ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నాళ్ల నుంచే ఇదే హంగామా నడుస్తు వచ్చింది. ఇక మెయిన్ గా ఏపీ రాజకీయాలకి సంబంధించి చాలా మంది టాలీవుడ్ స్టార్స్ బయటకి వచ్చారు.

అలాంటి నటుల్లో ప్రముఖ నటుడు శివాజి కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో టాలీవుడ్ లో కనిపించిన శివాజీ ఒక ఆరేళ్ళ కితం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తాను చేసిన ఆపరేషన్ గరుడ అంటూ పెద్ద సంచలనమే రేపింది. అలా సినిమాలు వదిలేసి రాజకీయాల్లో ఇలా మారిపోయాడు ఏంటి అని చాలా మంది తన కోసం అనుకున్నారు.
ఇక అక్కడ నుంచి తాను సినిమాల్లో కనిపించింది తక్కువ రాజకీయ వార్తల్లో కనిపించింది ఎక్కువ. తాను బాహాటంగానే టీడీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడ్డం కనిపించింది. కాగా అవన్నీ కొన్నాళ్ళు పక్కన పెట్టి మళ్ళీ తెలుగు ఆడియెన్స్ కి క్రేజీ హిట్ వెబ్ సిరీస్ 90స్ బయోపిక్ లో మళ్ళీ రీఎంట్రీ తాను అందించారు. అక్కడ నుంచి మళ్ళీ శివాజీ తెలుగు సినిమాకి దగ్గరవడం స్టార్ట్ అయ్యారు.
కాగా రీసెంట్ గానే ఊహించని నెగిటివ్ రోల్ చేసి కోర్ట్ అనే సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో కొత్త విలన్ దొరికేసాడు అనే రేంజ్ కి తన పేరు మారు మోగింది కూడా.. మరి ఇంత పాజిటివ్ మూడ్ లో తాను చేసిన షాకింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
అక్కడ నుంచి 11 అనేది ఒక ఎమోషన్ లా కూడా మారిపోయింది. మరి దీనిపైనే శివాజీ చేసిన కాంట్రవర్సియల్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. వాళ్లకి ఆ 11 కూడా రాకుండా ఉండాల్సింది అని నెక్స్ట్ అవి కూడా రావు సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితం అయ్యిపోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు కాక రేపుతున్నాయి.
దీనితో సినిమాల్లోకి వెళ్లి మళ్ళీ బిజీ అయ్యాడు అనుకునే లోపే మళ్ళీ శివాజీ నుంచి ఈ తరహా స్టేట్మెంట్ రావడం అది కూడా జగన్ లాంటి పవర్ఫుల్ వ్యక్తిపై చేయడం అనేది ఒకింత షాకింగ్ గానే ఉందని చెప్పాలి. తాను సహా తన ఎన్నారై ఫ్రెండ్స్ జగన్ కి ఆ 11 కూడా రావని అనుకున్నామని ఈసారి సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యిపోవాలని తాను కోరుకుంటున్నట్టుగా శివాజీ తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు సినీ వర్గాల్లో సహా రాజకీయ వర్గాల్లో కూడా వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











