Poonam Pandey బిగ్ ట్విస్ట్ : అందర్నీ ఫూల్స్ చేసిన పూనమ్ పాండే.. బతికే ఉన్నా.. వీడియో రిలీజ్
ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి విషయంలో బిగ్ ట్విస్ట్. నిన్న(ఫిబ్రవరి 2) ఆమె మరణించారన్న వార్త ప్రతిఒక్కర్ని షాక్‌కు గురి చేసిందన్న సంగతి తెలిసిందే. సర్వైకల్ క్యాన్సర్‌తో కన్నుమూసిందని అనౌన్స్ చేయడం అందర్నీ మరింత కలచివేసింది. అయితే నేడు(ఫిబ్రవరి 3) తాను బతికే ఉన్నానంటూ వీడియో బైట్‌ను రిలీజ్ చేసింది పూనమ్ పాండే. ఆమె ఎందుకు అలా డ్రామా చేయాల్సి వచ్చిందో వీడియోలో వివరించింది.
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన పూనమ్ 2013లో 'నషా' చిత్రంతో అరంగ్రేటం చేసింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన ఈమె సోషల్ మీడియా ఖాతా నుంచి శుక్రవారం ఉదయం చనిపోయినట్లు పోస్ట్ వచ్చింది. ఈ వార్త ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలోనే తాజాగా తాను బతికున్నానంటూ వీడియోను రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్ నానాటికీ ప్రమాదకరంగా మారుతోందని దానిపై అవగాహన కోసమే ఇలా చేశానంటూ వీడియోలో పేర్కొంది.
Recommended Video


అందరం కలిసి కృష్టి చేద్దాం : "హాయ్ నేను పూనమ్. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్లలేదు. బతికే ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్ వల్ల నేను ప్రాణాలు కోల్పోలేదు. కానీ, అది ఎన్నో వేలాది మంది మహిళల ప్రాణాలను బలిగొంది. దీనిపై అవగాహన లేక ఎంతో మంది కన్నుమూశారు. ఇది ఇతర క్యాన్సర్ల లాగా కాదు. దీనిని నివారించడం సాధ్యమైన పనే.
ముందస్తుగా గుర్తించి హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసుకుంటే నివారించవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలు ఉన్నాయి. అందరం కలిసి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిద్దాం" అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఇదంతా పబ్లిసిటీ స్టంటా, ఫూల్ చేశావుగా అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
అసలు జరిగింది ఇది : పూనమ్ చనిపోయిందన్న వార్త బయటకు రాగానే మొదట షాకైన ప్రతిఒక్కరికీ ఆ తర్వాత కొత్త అనుమానాలు మదిలో మెదిలాయి. ఆమె నిజంగానే చనిపోయిందా? అన్న అనుమానం ఎక్కువైంది. చాలా మంది పబ్లిసిటీ స్టంట్ అని కూడా అనుకున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలు చనిపోతే వారి ఇంటి దగ్గర, అలాగే వారు చనిపోయిన హాస్పిటల్ దగ్గర హడావుడి ఎక్కువ ఉంటుంది.
కానీ పూనమ్ పాండే ఇంటి దగ్గర అలా జరగలేదు. ఆమె కుటుంబసభ్యులు ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. దీంతో పూనమ్ పాండే నిజంగానే చనిపోయి ఉంటే ఆమె డెడ్ బాడీ ఎక్కడుంది? సర్వైకల్ క్యాన్సర్ కోసం ఏ హాస్టిటల్లో చికిత్స్ తీసుకుంది? సర్వైకల్ క్యాన్సర్ సోకితే అంత త్వరగా చనిపోతారా? వంటి ప్రశ్నలు రేకెత్తాయి. అందుకే చాలా మంది పబ్లిసిటీ స్టంట్ అని అనుకున్నారు. ఇదే సమయంలో ఆమె వీడియో రిలీజ్ చేసి సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన అని చెప్పింది.
అప్పట్లోనూ అలానే చేసింది : 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీ సమయంలో పూనమ్ ఓ సంచలన ప్రకటన చేసి పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత ఆమె వైవాహిక జీవితం కూడా ఎన్నో వివాదాలతో కొనసాగింది. ఓ సందర్భంలో తన భర్త శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ డివొర్స్ తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











