స్టార్ హీరోయిన్ కొడుకుని ఎలా వాడేసుకుంటున్నారో తెలుసా!
తైమూర్.. సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఈ పేరు కనిపిస్తూనే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ముద్దుల కొడుకు తైమూర్ ఇంటర్నెట్ లో సెన్సేషనల్ కిడ్ గా మారిపోయాడు. తైమూర్ చాలా క్యూట్ గా ఉండడంతో అతడి ఫోటోలు నెటిజన్లని విపరీతంగా కట్టుకుంటున్నాయి. తైమూర్ కు ఏర్పడిన క్రేజ్ దృష్ట్యా ఈ బుడతడిని పోలిన బొమ్మలని కూడా మార్కెట్ లోకి తీసుకుని వచ్చారు.
తైమూర్ క్రేజ్ ని వాడుకునేందుకు మరో కమర్షియల్ ప్లాన్ వేశారు. తైమూర్ అనే టైటిల్ తో ప్రముఖ దర్శకుడు మధుర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనే స్వయంగా తైమూర్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా తైమూర్ ని అంతా వాడేసుకుంటున్నారు.

తైమూర్ పేరుతో సినిమా రాబోతోంది అనే వార్తలపై సైఫ్, కరీనా ఇంకా స్పందించలేదు. పాల బుగ్గలతో బొమ్మలా ఉండే తైమూర్ కు నెటిజన్లలోనే కాదు.. బాలీవుడ్ సెలెబ్రిటీలలో కూడా మంచి క్రేజ్ ఉంది. అవకాశం ఉంటే తైమూర్ కు తండ్రిగా నటించాలని ఉందని రణవీర్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











