ఓ పక్క ఎంపురాన్ కాంట్రవర్సీ.. పృథ్వీరాజ్ కి మరో బిగ్ షాక్.. వెనుక వారి హస్తం?

ఇటీవల పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారిన సౌత్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మలయాళ సినిమా నుంచి వచ్చిన అవైటెడ్ సీక్వెల్ సినిమా ఎల్ 2 ఈ ఎంపురాన్ అని చెప్పవచ్చు. కాగా ఈ సినిమాలో లాలెట్టాన్ మోహన్ లాల్ హీరోగా నటించగా స్టార్ హీరో సహా దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించడం జరిగింది.

మరి ఈ సినిమా మళయాళ సినిమా దగ్గర కనీ వినీ ఎరుగని రేంజ్ హైప్ లో థియేటర్స్ లోకి వచ్చింది. దీనికి ముందు వచ్చిన మొదటి సినిమా లూసిఫర్ మలయాళంలో పెద్ద విజయం సాధించడంతో దానికి సీక్వెల్ పట్ల మోహన్ లాల్ అభిమానులు మాత్రమే కాకుండా యావత్తు మలయాళ సినిమా అభిమానులు ఆసక్తి కనబరిచారు.

after empuraan controversy another shock to prithviraj sukumaran

అయితే ఈ సినిమా ఇలా థియేటర్స్ లోకి వచ్చిందో లేదో మొదటి రోజు నుంచే పెను వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మెయిన్ గా మతపరంగా చాలా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వచ్చింది. పైగా అందరినీ వదిలేసి దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ అందరి ముందు దోషిగా నిలబడడం జరిగింది. దీనితో తన తల్లి కూడా మాట్లాడాల్సి వచ్చింది.

ఇలా ఓ పక్క ఇదే వివాదాన్ని పృథ్వీ రాజ్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో షాకింగ్ కాంట్రవర్సీ తనకి ఎదురయ్యింది. తనపై ఇపుడు ఐటీ దాడులకు సంబంధించిన వార్తలు ఇపుడు వైరల్ గా మారాయి. కాగా పృథ్వీ రాజ్ గత మూడు సినిమాలకి అందుకున్న పారితోషికం అలాగే తాను చెల్లించిన పన్ను లావాదేవీల విషయంలో అవకతవకలు ఉన్నాయని అందుకే తనపై ఇపుడు ఐటీ దాడులు నోటీసులు అందుకున్నట్టు తెలుస్తుంది.

దీంతో ఆ వివాదం ఇంకా ముగియకుండానే మరో కొత్త వివాదం ఈ టాలెంటెడ్ నటుడు/దర్శకుణ్ణి చుట్టి ముట్టింది అని చెప్పక తప్పదు. ఇక ఇదిలా ఉండగా ఈ ఐటీ నోటీసులపై మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. కాగా దీని ప్రకారం మాత్రం ఈ ఎంపురాన్ సినిమా మూలానే పొలిటికల్ గా ఓ పార్టీ హస్తంతో తనపై ఈ దాడులు చేస్తున్నారని దాని ప్రభావమే ఇదంతా అని పుకార్లు వినిపిస్తున్నాయి.

దీనితో మరోసారి పృథ్వీ రాజ్ సుకుమారన్ మేటర్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎంపురాన్ సినిమా మలయాళ ఇండస్ట్రీ దగ్గర ఆల్ టైం రికార్డు వసూళ్లు అందుకొని సంచలనం సెట్ చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కాగా ఇపుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంశం పక్కన పెడితే తాను నటుడుగా తెలుగులో భారీ సినిమాలు చేస్తున్నారు.

ప్రస్తుతం సెన్సేషనల్ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో సినిమాలో కీలక పాత్ర తాను పోషిస్తుండగా ఈ సినిమా కాకుండా పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం సలార్ 2 శౌర్యంగ పర్వంలో కూడా తాను కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X