మళ్ళీ తెర పైకి రాజ్ తరుణ్, లావణ్య వివాదం.. మాజీ ప్రేయసిపై దాడి.. అతడి హస్తం?
తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యువ హీరోస్ లో ఆ మధ్య అంతా సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీ లతోనే హైలైట్ గా ఎక్కువ వినిపించిన హీరో ఎవరు అంటే జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అనే చెప్పాలి. రాజ్ తరుణ్ కి తెలుగు సినిమా దగ్గర ఎంటర్ అయ్యిన కొంత కాలం లోనే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.
ఇలా మంచి ఫామ్ ని కొనసాగించిన రాజ్ తరుణ్ హీరోగా ఇపుడు తక్కువ సినిమాలే చేస్తున్నాడు పైగా అవి కూడా ముందులా పెద్దగా రాణించడం లేదు. మరి ఈ నేపథ్యంలో తనపై కొన్ని షాకింగ్ ఆరోపణలు కాంట్రవర్సీలు కూడా మొదలయ్యాయి. రాజ్ తరుణ్ తనని వాడుకొని మోసం చేసాడని ప్రేమించి పెళ్లి కూడా చేసుకొని ఇపుడు తనని వదిలేసాడు అంటూ పెద్ద రచ్చనే తన మాజీ ప్రేయసి లావణ్య తెలిపింది.

ఇక ఆ తర్వాత కూడా మరిన్ని ట్విస్ట్ లు టర్నింగ్ లలో మంచి రసవత్తరంగా వీరి నడుమ వార్ నడిచింది. ఇక దీనితో పాటుగా మధ్యలో ఓ నార్త్ హీరోయిన్ అలాగే మస్తాన్ సాయి అనే కొత్త వ్యక్తి ఇలా చాలా మంది పేర్లు మధ్యలో వచ్చి సంచలనం రేపాయి. ఇక లావణ్య రాజ్ తరుణ్ ని సదరు బాలీవుడ్ హీరోయిన్ తో రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకోవడం చాలానే జరిగాయి.
ఇక ఇవన్నీ ఒక మూమెంట్ లో పక్కకి వెళ్ళిపోయి రాజ్ తరుణ్ మళ్ళీ తన సినిమాలు చేసుకుంటూ బిజీగా మారాడు. కాగా మళ్ళీ ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్, లావణ్య వివాదం తెర పైకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా తాజా గాసిప్స్ ప్రకారం లావణ్యపై దాడి జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెపై తన రెసిడెన్సీ దగ్గరే రాజ్ తరుణ్ కుటుంబీకులే దాడి చేయించినట్టుగా టాక్ ఇపుడు వినిపిస్తుంది.
దీనితో అక్కడ దగ్గరలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో స్థానిక పోలీస్ వారు కలుగజేసుకొని గొడవ ఆపారట. మరి మళ్ళీ ఆరిపోయింది అనుకున్న ఈ ఇద్దరి జంట కాంట్రవర్సీ ఇపుడు ఊహించని విధంగా మళ్ళీ హైలైట్ కావడం అనేది చర్చకి దారి తీసింది. ఇక ఇదిలా ఉండగా ఇవన్నీ చూస్తుంటే మరికొన్ని సందేహాలు లేవనెత్తుతున్నాయి. తంలో ఈ కాంట్రవర్సీ సమయంలోనే రాజ్ తరుణ్ మూడు సినిమాలు రిలీజ్ చేసుకున్నాడు.
నార్మల్ గా ఉంటే పెద్దగా తన పేరు వినిపించలేదు. కానీ లావణ్య కేసుతో మాత్రం తన సినిమాలు కొంచెం అయినా వెలుగులో కనిపించాయి. కాగా ఇపుడు మళ్ళీ రాజ్ తరుణ్ నటించిన మరో చిత్రం పాంచ్ మినార్ రాబోతుంది. కాగా దీనికి కూడా వాటిలానే పెద్దగా బజ్ లేదు. సో మళ్ళీ తనపై వార్తలు హైలైట్ కావడంతో ఈ వెనుక రాజ్ తరుణ్ కూడా ఉన్నాడా అనే అనుమానాలు కూడా ఇపుడు రేకెత్తుతున్నాయి. మరి చూడాలి వీరి వివాదం మళ్ళీ ఎక్కడ వరకు వెళుతుంది అనేది.


Click it and Unblock the Notifications











