మహర్షి కాంబినేషన్ మళ్లీ రిపీట్.. కొత్త మహేష్‌ను చూస్తారు.. సూపర్ స్టార్ కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాన్ని ప్రకటించేశాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో కలసి చేసిన సరిలేరు నీకెవ్వరు విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తరువాత రాబోతోన్న సరిలేరుపై కూడా అంతటి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ మూవీ సక్సెస్‌పై చిత్రబృందం ఎంత నమ్మకంగా ఉందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మహేష్ తదుపరి చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చేసింది. సరిలేరు ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్ మాట్లాడుతూ.. అనేక విషయాలను వెల్లడించాడు.

ముందే చేయగలమా అని అడిగాను..

ముందే చేయగలమా అని అడిగాను..

మహేష్ మాట్లాడుతూ.. ‘F2 సమయంలోనే అనిల్ ‘సరిలేరు నీకెవ్వరు' కథను ఓ నలబై నిమిషాల చెప్పాడు. అయితే ఆ టైంలో ఇద్దరికీ చెరో సినిమా ఉంది కానీ ‘F2'రిలీజ్ తర్వాత సొంతంగా డిసిషన్ తీసుకొని మరీ అనిల్ ను ముందు చేయడం ఏమైనా కుదురుతుందా..? అని అడిగాను. అనిల్ వెంటనే ఒకే చెప్పేసి మూడు నెలల్లో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకొచ్చాడు. నా కెరీర్ లోనే ఇది బెస్ట్ డిసిషన్ అనుకుంటున్నా'ని అన్నాడు.

కమర్షియల్ ఓరియెంటెడ్..

కమర్షియల్ ఓరియెంటెడ్..

మహర్షి సమయంలోనే వంశీ కథ చెప్పాడని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం మాత్రం వెంటనే పట్టాలెక్కదని టాక్. ‘సరిలేర నీకెవ్వరు' రిలీజ్ తరువాత మూడు నెలలు గ్యాప్ తీసికుంటానని.. ఆ తర్వాత నుండి వంశీ పైడిపల్లితో సినిమాని స్టార్ట్ చేస్తానని మహేష్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టాడని తెలుస్తోంది. అయితే ఇది కమర్షియల్ ఫార్మాట్‌లో సాగుతుందని తెలిపాడు.

కొత్త మహేష్‌ను చూస్తారు..

కొత్త మహేష్‌ను చూస్తారు..

ఇక సినిమాలో కొత్త మహేష్ ని చూస్తారని అన్నాడు. ‘శ్రీమంతుడు' నుండి ‘మహర్షి' వరకూ చేసిన సినిమాలన్నీ ఓ సందేశంతో కూడినవని వాటి నుండి బయటికొచ్చి నేను చేసిన పక్కా ఎంటర్టైన్ మెంట్ సినిమా అని తెలిపాడు. ఇక అనిల్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒకెత్తు అయితే సరిలేరు నీకెవ్వరు ఒకెత్తు అని తెలిపాడు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఫ్యాన్స్‌కు నచ్చుతుందని తెలిపాడు.

అందుకే నెల గ్యాప్..

అందుకే నెల గ్యాప్..

ఈ కథ చెప్పాక.. తనను తాను మార్చుకునేందుకు నెల సమయం తీసుకున్నానని తెలిపాడు. ఆర్మీ లుక్‌లోకి వచ్చేందుకు నెల రోజుల్లో ఆరు కేజీలు తగ్గానని అన్నాడు. అందుకే జూన్‌లో అనుకున్న సినిమాను జూలైలో ప్రారంభించామని తెలిపాడు. ఈ పాత్రలో ప్రవేశించడానికి, డైరెక్టర్‌ను ఫాలో కావడానికి మొదటి నాలుగు రోజులు ఇబ్బంది పడ్డానని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X