మొన్న మహేష్ ఫ్యామిలీ ఇప్పుడు తారక్ ఫ్యామిలీ.. ఖర్చులో ఎవ్వరు తగ్గట్లేదుగా..

నిత్యం సినిమాలతో బిజీగా ఉండే సినిమా తారలకు కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపే తీరిక ఉండేది కాదు. అయితే కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ ద్వారా చాలా రోజులు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశారు స్టార్ హీరోలు. అయితే దాదాపు 8 నెలలు పని లేకుండా గడపడంతో కొంత వరకు బోర్ కొట్టేసింది. ఇక కరోనా తాకిడికి అలవాటు పడిన కొందరు స్టార్స్ జాగ్రత్తలు తీసుకుంటూ విహార యాత్రల కోసం దేశాలు దాటుతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే ప్లాన్ వేశాడు.

అందుకే విమానం ఎక్కేస్తున్నారు

అందుకే విమానం ఎక్కేస్తున్నారు

లాల్ డౌన్ తరువాత బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు విదేశాలు దాటేశారు. షూటింగ్ లకు అలవాటు పడిన ప్రాణాలు.. ఒక చోట కుదురుగా ఉండవు. అందుకే విమానం ఎక్కేసి కొన్ని రోజులు ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయాలని వెళ్లారు. చాలా మంది తారలు మాల్దీవులను టార్గెట్ గా పెట్టుకున్నారు. హీరోయిన్స్ కూడా అక్కడ స్పెషల్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మహేష్ బాటలోనే మిగతా హీరోలు

మహేష్ బాటలోనే మిగతా హీరోలు

ఇక టాలీవుడ్ నుంచి కూడా సెలబ్రెటీలు ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్న మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. మహేష్ ఎంత బిజీగా ఉన్నా కూడా మధ్య మధ్యలో తన పిల్లలను విదేశాలకు తీసుకువెళుతు ఉంటాడు. ఇక అదే బాటలో మరికొందరు హీరోలు కూడా నడుస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా..

జూనియర్ ఎన్టీఆర్ కూడా..

ఇక త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా దుబాయ్ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తారక్ ఫ్యామిలీని హాలిడేస్ కి తీసుకెళ్లి చాలా కాలమవుతోంది. అందుకే ఈ సారి దుబాయ్ కి వెళ్లాలని ప్లాన్ వేశాడట. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా హ్యాపీగా కొన్ని రోజులు విలాసవంతమైన హాలిడేస్ ని ఎంజాయ్ చేసే విధంగా ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Gatham Team On Their Technical Team Brilliance | Interview Part 3
 దుబాయ్ నుంచి వచ్చిన తరువాత RRR షూట్

దుబాయ్ నుంచి వచ్చిన తరువాత RRR షూట్

దుబాయ్ లో కరోనా తాకిడి తక్కువగా ఉంటుందని అందరూ అక్కడికే వెళుతున్నారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడంతో మిగతా స్టార్లు కూడా దుబాయ్ ని బీట్ ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక తారక్ దుబాయ్ వెళ్లివచ్చిన తరువాత RRRకి సంబంధించిన తుది షెడ్యూల్ లో పాల్గొననున్నాడు. అప్పటివరకు జక్కన్న టీమ్ వేరే పనుల్లో బిజీగా ఉండనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X