పెళ్లిపై కీర్తి సురేష్ హాట్ కామెంట్స్ .. మొత్తానికి పుకార్లు నిజం చేస్తూ..
రీసెంట్ గా మన సౌత్ సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో వినిపిస్తున్న టాప్ అండ్ యంగ్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరని చెప్పాలి. కీర్తి ఓ పక్క సినిమాల్లో తన కెరీర్ దెబ్బ తింటున్నప్పటికీ తాను మాత్రం గ్యాప్ లేకుండా ఇంకా ఎనర్జిటిక్ గా దూసుకెళ్తుంది. ఈ మధ్య అంతగా హిట్స్ లేకపోయినప్పటికీ తన హాట్ షో అంద చందాలతో అలరిస్తూ వస్తున్నారు. ఇపుడు ఫైనల్ గా సినిమాలకి మించి కిక్ ఇచ్చే వార్తను పట్టుకొచ్చింది అని చెప్పాలి.
కాగా కీర్తి సురేష్ పై గత కొన్నాళ్ల నుంచి వస్తున్న ప్రేమ, పెళ్లి అనే అంశాలపై ఒక్కొక్కటిగా క్లారిటీ ఇస్తూ వస్తుంది. మొదట తాను ప్రేమలో లేను అని చెప్పి పలు వార్తలు ఖండించింది. అలాగే పెళ్లి పుకార్లని కూడా కొట్టి పారేసింది. దాంతో అప్పట్లో ఈ వ్యవహారం సర్దుమణిగింది. కానీ కొన్ని రోజుల క్రితం మాత్రం కీర్తి తన స్నేహితున్నే పెళ్లి చేసుకోబోతుంది అంటూ వచ్చిన పలు వార్తలు ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

కాగా ఈ పుకార్ల విషయంలో ఆమె పెద్దగా స్పందించకపోవడంతో చాలా మంది మౌనం అర్ధాంగీకారం అనుకోని నిజమే అనుకున్నారు. ఇక దీనితో పాటుగా తన పెళ్లి కూడా ఎప్పుడో కాదు డిసెంబర్ లోనే అయిపోతుంది అని కూడా అందులో వినిపించాయి. అయితే ఇలా పుకార్లు కొనసాగుతున్న నేపథ్యంలో పెళ్లి, ప్రేమ రెండు అంశాల్లో అయితే ఆమె మొదట నిజంగానే తాను ప్రేమలో ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసేసింది.
తన స్నేహితుడు ఆంటోనీతో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 15 ఏళ్ళు నుంచి ప్రేమలో ఉన్నట్టుగా తెలిపి ట్విస్ట్ ఇచ్చింది. ఇక ప్రేమపై తేల్చేసిన కీర్తి ఇపుడు పెళ్లిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది అని చెప్పాలి. తాజాగా కీర్తి సురేష్ ఏపీలోని ప్రముఖ దేవస్థానం తిరుమల తిరుపతికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడిన మాటలు స్పెషల్ అటెన్షన్ తెచ్చుకున్నాయి.

తన పెళ్లి వచ్చే నెలలోనే జరగబోతోంది అని అందుకే భగవంతుని ఆశీస్సులు కోసం వచ్చాను అంటూ కీర్తి సురేష్ అసలు క్లారిటీ ఇచ్చేసింది. దీనితో ఈమె పెళ్లి విషయంగా వచ్చిన పుకార్లన్నీ నిజమే అని చెప్పాలి. దీనితో డిసెంబర్ లోనే కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా గోవాలో జరగనుంది అని అందరికీ అర్ధమైపోయింది. ప్రస్తుతానికి డిసెంబర్ 11 అలాగే 12 తేదీల్లో తన పెళ్లి జరుగుతుంది అని టాక్ నడుస్తోంది.
ఇక ఇది కాకుండా ఈమె నటిస్తున్న అవైటెడ్ బాలీవుడ్ సినిమా 'బేబీ జాన్' కూడా ఇదే డిసెంబర్ లో విడుదల కాబోతుంది. ఇందులో కూడా కీర్తి సురేష్ నెవర్ బిఫోర్ హాట్ షోతో ఒక్కసారిగా సోషల్ మీడియాని హీటెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఇది కాకుండా తెలుగు సహా తమిళ్ లో కీర్తి సురేష్ పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











