అల్లు అర్జున్ కు సంధ్య థియేటర్ టెన్షన్.. పుష్ప 2 తర్వాత మళ్ళీ..!
గత ఏడాదిలో ఇండియన్ సినిమా దగ్గర అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద హిట్ అయ్యిన సినిమాలు కొన్ని ఉన్నాయి కానీ ఇలా హిట్ తో పాటుగా భారీ ఎత్తున కాంట్రవర్సీ రేపిన సినిమా మాత్రం ఒకటే ఉందని చెప్పవచ్చు. కాగా ఆ చిత్రమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ సీక్వెల్ సినిమా పుష్ప 2 ది రూల్.
కాగా ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రానికి లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ ధరలు అందుకొని రిలీజ్ చేసుకున్నారు. కాగా ఇదే ఇపుడు సినిమా పట్ల ఇప్పటికీ గట్టి నెగిటివిటీ కొనసాగిస్తుంది. కాగా ఈ సినిమా రిలీజ్ కి ముందు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏ రీతిలో సంచలనం సెట్ చేసిందో తెలిసిందే.

అక్కడ జరిగిన ఘటనతో దెబ్బకు అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. దీంతో సంధ్య థియేటర్ అనే అంశం అల్లు అర్జున్ కి ఒక నైట్ మేర్ గా నిలిచిపోయింది. ఇక అక్కడ నుంచి ఈ ఘటనపై ఏదొక సందర్భంలో అల్లు అర్జున్ పేరు ఇప్పటికీ రాకుండా ఉండడం లేదు. అరెస్ట్ అనో లేక ఇతర అంశాల్లో కానీ బన్నీ పేరు హైలైట్ అవుతూ వచ్చింది.
ఇక తాజాగా మరోసారి సంధ్య థియేటర్ అంశంలో అల్లు అర్జున్ పట్ల కొంచెం హై టెన్షన్ వాతారవరణం నెలకొంది అని చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా తన మ్యూజికల్ హిట్ సినిమా ఆర్య 2 ని రీరిలీజ్ కి అభిమానులు తీసుకుచున్నారు. కాగా హైదరాబాద్ లో ఫేమస్ అయ్యినటువంటి క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్స్ లో కూడా ఈ చిత్రం విడుదల కావడం జరిగింది.
దీనితో ఈ ఉదయం నుంచే అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్ళీ అభిమానులు చేసే హంగామా లాంటిది లేకుండా పోలీసులు ముందే థియేటర్ దగ్గరకి చేరుకున్న విజువల్స్ ఇపుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. దీనితో మళ్ళీ ఈసారి ఏమన్నా అయితే అది మళ్ళీ అల్లు అర్జున్ కే టెన్షన్ తెచ్చి పెడుతుంది అని చెప్పక తప్పదు.
మరి అభిమానుల అత్యుత్సాహాలు ఏమో కానీ ఇవి కాస్తా తమ హీరోలకే ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. కాగా ఇపుడు అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ తర్వాత నెక్స్ట్ సినిమాల కోసం సన్నద్ధం అవుతున్నాడు. వెంటనే అయితే దర్శకుడు అట్లీతో సినిమా మొదలు కానుంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక నెవర్ బిఫోర్ ఫాంటసీ సబ్జెక్టు అలానే సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో భారీ సినిమాలతో బన్నీ ఫ్యూచర్ ని గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఈ రానున్న అల్లు అర్జున్ బర్త్ డే కి అట్లీ సినిమాపై ఓ బిగ్ అనౌన్సమెంట్ రానున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











