రాజమౌళి "మహాభారతం" సెన్సేషనల్ ప్లాన్ .. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫోర్స్‌తో కలవబోతున్నారా?

భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన వన్ అండ్ ఓన్లీ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్‌గా దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన లాస్ట్ చిత్రం RRRతో గ్లోబల్ సంచలనంగా తాను మారిపోయారు. దీనితో నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏకంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయని ఆల్రెడీ అంతా ఫిక్స్ అయ్యిపోయారు.

RRR సెట్ చేసిన స్టాండర్డ్స్ తో తాను భారతీయ సినిమాని మెయిన్ గా తెలుగు సినిమాని ప్రపంచంలో ఇంకా పై స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు జక్కన్న. సరే ఇదంతా బాగానే ఉంది కానీ రాజమౌళి ఎన్ని సినిమాలు చేసినప్పటికీ తన వన్ అండ్ ఓన్లీ డ్రీం ప్రాజెక్ట్ మాత్రం "మహాభారతం" సినిమానే అని అందరికీ తెలుసు. ఎన్నో ఏళ్ళు క్రితమే రాజమౌళి మహాభారత కావ్యాన్ని తెరకెక్కించడం తన జీవిత లక్ష్యం అని సెలవిచ్చారు.

after rajamouli amir khan also excited with mahabharata is these to collab

అయితే ఇది మొదలు కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. అది ఏకంగా ఒకటి కాదు 10 భాగాలుగా చేస్తారు అనే వార్తలు కూడా ఉన్నాయి. మరి జక్కన్నకి మన పురాణాలు, ఇతిహాసాలు పట్ల ఉన్న గ్రిప్ తో మహాభారతం సినిమా ఇండియన్ సినిమా దగ్గర చేయాలి అంటే అది ఒక్క రాజమౌళి మాత్రమే చెయ్యాలి అనే ఒక మార్క్ పడిపోయింది.

దీనితో తాను ఎప్పుడు ఎలా ఈ డ్రీం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి దశలో రాజమౌళికి తోడుగా మహాభారతం అంటే నాకు కూడా డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఇండియన్ సినిమా దగ్గర మరో స్టార్ హీరో చెబుతున్నారు. ఆయనే భారతీయ చిత్ర పరిశ్రమలో హైయెస్ట్ గ్రాస్ కలిగిన ఏకైక హిందీ హీరో ఆమీర్ ఖాన్. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇపుడు చర్చకి దారి తీశాయి.

after rajamouli amir khan also excited with mahabharata is these to collab

తనకి ఉన్న ఏకైక డ్రీం ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది మహాభారతం తెరకెక్కించాలి అని మనసులో మాట తెలిపారు. మహాభారతం అనేది భారతీయులు ప్రతీ ఒక్కరి నరనరాల్లో రక్తంలో ఇమిడిపోయింది అని ఆమీర్ తెలిపారు. అందుకే మహాభారతం తీయడం అనేది చిన్న విషయం కాదు.. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒకవేళ సరిగ్గా తీయకపోతే పరిస్థితి ఏంటి అని నేనెప్పుడూ భయపడుతూ ఉంటాను అని ఆమీర్ ఖాన్ సెలవిచ్చారు.

దీనితో ఇండియన్ సినిమా దగ్గర ప్రైడ్ కాంబినేషన్‌కి మహాభారతం సినిమా తీయడం ఒక ఎపిక్ ఎమోషన్ గా మారింది అని చెప్పాలి. మరి జక్కన్న ఫ్యాషన్‌కి ఒక నటుడుగా అలాగే నిర్మాతగా కూడా ఆమీర్ ఖాన్ సపోర్ట్ కలిస్తే మాత్రం ఈ మహాకావ్యం కార్యరూపం దాల్చడం తథ్యం అని చెప్పొచ్చు. మరి ఇండియాస్ బిగ్గెస్ట్ ఫోర్సెస్ అయిన ఇద్దరూ కలిసి ఈ సంచలన ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తారో లేదో అనేది వేచి చూడాలి మరి.

More from Filmibeat

Read more about: rrr movie rajamouli mahabharatam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X