RRR టీజర్ ఒక్కటే కాదు.. మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్
మే నెలలో 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ యొక్క మొదటి టీజర్ వస్తుందని నందమూరి అభిమానులు ఎన్ని ఆశలతో ఎదురుచూసారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే కరోనా ద్వెబ్బకు వారి ఆశలన్నీ కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఇక మళ్ళీ వచ్చే పుట్టినరోజుకు టీజర్ వదులుతారా అనే అనుమానాలు ఎక్కువవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ చెప్పిన గుడ్ న్యూస్ వారి ఆశాల్లో ఒక ఊపిరి నింపింది.
అసలు మ్యాటర్ లోకి వస్తే RRR టీజర్ మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే అది విడుదలైన మరికొన్ని రోజులకే మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. RRR అనంతరం తారక్ త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఎనౌన్స్మెంట్ తప్పితే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అందుకే ఏదైనా స్పెషల్ అప్డేట్ ఇవ్వాలని చూస్తున్నారు.

సినిమాకు సంబంధించిన టైటిల్ కాన్సెప్ట్ లుక్ ని విడుదల చేయాలని ఇటీవల త్రివిక్రమ్ నిర్మాతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే ఒక టైటిల్ ని అనుకుంటున్నట్లు టాక్ అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని నిర్మాతలు చినబాబు, కళ్యాణ్ రామ్ ఇటీవల త్రివిక్రమ్ తో జరిపిన చర్చల్లో టైటిల్ అయినా లేకుంటే కాన్సెప్ట్ పోస్టర్ ని అయినా విడుదల చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











