Agadha Teaser Review: అగధ మూవీ టీజర్ రివ్యూ
టాలీవుడ్ షో మ్యాన్, అగ్ర నిర్మాత ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో రూపొందిన డివైన్ థ్రిల్లర్ మూవీ అగధ. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా విడుదలకు కూడా సిద్దం చేస్తున్నారు.
ఈ సినిమా సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. సంగీత దర్శకుడు: రాకేష్ వెంకటాపురం, సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, అదనపు స్క్రీన్ ప్లే: చైతన్య వేగి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ వి ఎన్ సుబ్బరాజు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టీజర్ ఎలా ఉంది? ఈ చిత్రం గురించి ఎంఎస్ రాజు ఏం చెప్పారనే వివరాల్లోకి వెళితే..

ఆత్మ, ప్రేతాత్మలు, అతీంద్రియ శక్తులు అంశాలుగా ఎంఎస్ రాజు రాసుకొన్న పాయింట్, పాత్రలు, సన్నివేశాలు ఇంటెన్సివ్‌గా, ఎమోషనల్‌గా ఉన్నాయనే విషయాన్ని ఆగధ టీజర్ చెప్పకనే చెప్పింది. ఈ చిత్రంలోని సన్నివేశాలు, వాటిని చిత్రీకరించడానికి ఉపయోగించిన సాంకేతిక నిపుణుల పనితనం భారీ అంచనాలు టీజర్‌తోనే క్రియేట్ చేసింది. ఎంఎస్ రాజు మరో దేవీ లాంటి సినిమాను అందించబోతున్నారనే సంకేతాలను అందించింది. కథ డిమాండ్ మేరకు సన్నివేశాలను ఎలివేట్ చేసేందుకు ఉపయోగించిన లైటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్ వర్క్ చాలా నాణ్యతతో కనిపించింది.
ఇక కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ పోషించిన పాత్రల్లో చాలా డెప్త్ కనిపించింది. టీజర్‌తోనే ఎంఎస్ రాజు తన మార్కు మేకింగ్‌ను చూపించారనే చెప్పాలి. వీడియోలో ఏం చూశావంటూ కలిగించిన క్యూరియాసిటీ బాగుంది. అలాగే గుహలో ఏం జరిగింది? అగధ వచ్చేసింది. అగధ ముందు ఎవరి ఆటలు సాగవు అంటూ టీజర్‌తో సినిమాను ఎలివేషన్ చేసిన తీరు హైలెట్‌గా ఉంది.
అగధ టీజర్ గురించి ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. ఫిల్మ్ మేకర్‌గా నాకు ఎన్నో కలలుంటాయి. నా కలలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాల్ని తీశాను. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అగధని ఓ స్థాయికి తీసుకు వచ్చాను. నా సోదరి సమానురాలైన విశాలాక్షి, డాక్టర్ రాజు, సుబ్బరాజు థాంక్స్. మా టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నా. నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నా అని అన్నారు.

అగధ సినిమా కోసం టెక్నీషియన్ల పనితనం, ఆర్టిస్టుల వర్క్ ఎలా ఉండబోతోందో టీజర్ చూస్తేనే అర్థమై ఉంటుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది. టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. మహాదేవిగా కామాక్షి డెడికేషన్, సిన్సియారిటీకి హ్యాట్సాఫ్.శ్రవణ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ మూవీతో శ్రవణ్ వేరే రేంజ్‌కి వెళ్తాడు. ఉల్కా అద్భుతమైన నటి. మంజుల గారి మనవరాలు, వనిత గారి కూతురు జోవిక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నారు. మంజుల గారి లెగసీని జోవిక కంటిన్యూ చేస్తారు. అగధ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని ఎంఎస్ రాజు అన్నారు.


Click it and Unblock the Notifications