ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ని వెలివేశారా? నందమూరి ఫ్యామిలీలో విభేదాలు మరోసారి!

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు టాప్ మోస్ట్ కుటుంబాల్లో దాదాపు అన్ని కుటుంబాల్లో కూడా కుటుంబ కలహాలు బహిర్గతంగానో లేదా అంతర్గతంగానో ఉండడం అనేది చాలా సహజం. అయితే ఇది సినిమా కుటుంబాల్లో కాబట్టి కొంచెం పెద్దగా అనిపిస్తాయి. కాగా ఈ కాంట్రవర్సీలు, గొడవలకి ఒకప్పుడు మెగా కుటుంబం దూరంగా ఉండేది కానీ ఇపుడు వీరి నడుమ కూడా కలహాలు రావడం అనేది గత ఏడాది టాలీవుడ్ కి బిగ్ న్యూస్ అయ్యింది.

కాగా మెగా ఫ్యామిలీ కాంట్రవర్సీ కంటే ముందు టాలీవుడ్ లో బిగ్ ఫ్యామిలీ కాంట్రవర్సీ ఏదన్నా ఉంది అంటే అది నందమూరి కుటుంబం లోనే అని చెప్పవచ్చు. కాగా నందమూరి కుటుంబంలో నందమూరి బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ నడుమ ఎన్నో దశాబ్దాలు నుంచి కూడా ఒక కోల్డ్ వార్ అయితే ఉందని అందరికీ తెలిసిందే.

again nandamuri family sides jr ntr in balayya padma award

కాగా మధ్యలో చాలా సార్లు బాలయ్య తారక్ ని దూరం పెడుతున్నారని తారక్ దగ్గరవుదామని చూసినా కూడా దూరం పెడుతూనే ఉంటారు అని ఓ టాక్ ఇంకా బయట కూడ పలు వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. దీనితో మధ్యలో వీరి నడుమ అంతా సెటిల్ అయ్యింది అనుకుంటారు కానీ ఎక్కడా ఇది మాత్రం ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపించలేదు.

ఎక్కడి వరకు ఎందుకు జస్ట్ కొన్ని రోజులు కితమే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తన టాక్ షోలో కావాలనే ఎన్టీఆర్ టాపిక్ ని బాలయ్య దాటవేశారని వచ్చిన ఓ టాక్ దుమారం రేపి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి లోనయ్యేలా చేసింది. దీనితో డాకు మహారాజ్ మేకర్స్ వాటిని కవర్ చేసే యత్నం చేశారు. అది అక్కడితో అయ్యింది.

తర్వాత బాలయ్యకి కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది బిగ్ థింగ్ గా మారడంతో జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో బాల బాబాయ్.. అంటూ చేసిన పోస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎంతో ఆనందం నింపింది. మరి ఇది మర్చిపోయే లోపే.. జూనియర్ ఎన్టీఆర్ కి మళ్ళీ బాలయ్య సైడ్ నుంచి అవమానం జరిగింది అంటూ ఓ రచ్చ ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యింది.

again nandamuri family sides jr ntr in balayya padma award

బాలయ్యకి పద్మ అవార్డు రావడంపై తాజాగా పేపర్ కటింగ్స్ కొన్ని పలు వార్తా పత్రికల్లో నందమూరి సహా నారా కుటుంబం నుంచి వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆ రెండు కుటుంబాల నుంచి అందరి పేర్లు ఉన్నాయి కానీ షాకింగ్ గా జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ల పేర్లు ఎక్కడా కనిపించలేదు. దీనితో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని కుటుంబమే సైడ్ చేసేసారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

ఇక దీనిపై కొందరు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, బాలయ్యకి దగ్గరవుదాం అని చూస్తున్నా కూడా దూరం పెడుతున్నారు. ఎందుకు? అంటున్నారు. ఇన్ని అవమానాలు మా హీరోకి అవసరమా పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రావొద్దు అని సోషల్ మీడియాలో ఇపుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వీరి కలహాలకు ఎలాంటి ముగింపు చూడాలి మరి.

More from Filmibeat

Read more about: jr ntr balakrishna daaku maharaaj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X