ఎన్టీఆర్‌ని దెబ్బ కొట్టిన జక్కన్న .. రాజమౌళికి నచ్చని "దేవర"?
తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి పలువురు దర్శక హీరోలలో చాలా మంది మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. అలా టాలీవుడ్ లో ఎపుడు నుంచో మంచి స్నేహితులుగా అలాగే పలు భారీ హిట్స్ కూడా ఇచ్చిన కాంబినేషన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ తదితరులు ఉన్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ కూడా ఒకటి.
మరి ఈ ముగ్గురు దర్శకులు తమ హీరోలకి మూడు అంతకు మించే సినిమాలు చేశారు. అయితే వారి ఫ్రెండ్షిప్ అంతా బాగానే ఉంది కానీ లేటెస్ట్ గా రాజమౌళి ఎన్టీఆర్ మేటర్ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. జక్కన్నకి ఎన్టీఆర్ అన్నా, ఎన్టీఆర్ నటన అన్నా ఎంతో ఇష్టం అని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అలా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొన్న పాన్ వరల్డ్ షేకింగ్ సినిమా RRR వంటి హిట్స్‌ను ఎన్టీఆర్‌కు ఇచ్చారు రాజమౌళి.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించారు. ఆ చిత్రమే దేవర.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల అయ్యి భారీ వసూళ్లు కూడా అందుకుంది. కానీ ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కి ఎంతో సన్నిహతుడు, పైగా ఎన్నో సినిమాలు కలిసి చేసినవాడు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం జరిగింది.
ఈ సినిమా ట్రైలర్ నుంచి రిలీజ్ తర్వాత కూడా జక్కన్న నుంచి ఒక్క ట్వీట్ కూడా సోషల్ మీడియాలో పడలేదు. కానీ లేటెస్ట్ పాన్ ఇండియా సినిమాని షేక్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం "పుష్ప 2" ట్రైలర్ కి మాత్రం ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతూ పోస్ట్ చేసాడు. దీనితో ఇది ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయనివాడు పుష్ప 2 ట్రైలర్ కోసం ఇంతలా ఎగ్జైట్ అవ్వడం అనేది ఆసక్తిగా మారింది.

దీనితో జక్కన్న తారక్‌కి ఎందుకు హ్యాండిచ్చి పుష్ప కి జై కొట్టినట్టు అనీ చర్చ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే మొన్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి కూడా రాజమౌళి పోస్ట్ చేయలేదు కదా అంటే? జక్కన్నకి చరణ్ కంటే ఎన్టీఆర్ తో ఎక్కువ కాలం నుంచి ఫ్రెండ్ షిప్ ఉంది . పైగా చరణ్ తో సినిమా కంటే ముందే మూడు సినిమాలు ఎన్టీఆర్ తో రాజమౌళి చేసాడు.
ఎలా చూసుకున్నా ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం ఎక్కువ. అలాంటప్పుడు దేవర విషయంలో సైలెంట్ గా ఉన్న రాజమౌళి పుష్ప 2 కోసం మాట్లాడ్డం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇపుడు మింగుడు పడడం లేదు. ఆల్రెడీ RRR విషయంలోనే తమ హీరోని కొంచెం చిన్నగా చూపించారనే డిజప్పాయింట్మెంట్ లో ఉంటే ఇది ఇపుడు కొత్తగా మరొకటి అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











