HBD Akhil Akkineni: అక్కినేని ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్.. పవర్‌ఫుల్ లుక్‌లో అఖిల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ల వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే సక్సెస్ అవగా.. చాలా మంది గుర్తింపును కూడా అందుకోలేకపోయారు. అయితే, మరికొందరు మాత్రం పరిచయమైన సుదీర్ఘ విరామం తర్వాత తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. వరుస పెట్టి పలు చిత్రాలను చేసినా సక్సెస్‌ను మాత్రం ఖాతాలో వేసుకోలేకపోయాడు. దీంతో అతడి కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోతుందని అంతా అనుకున్నారు.

వరుస ఫ్లాపులతో సతమతం అయిన సమయంలో అక్కినేని అఖిల్ గత ఏడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీతో అతడు విజయాల బాట పట్టాడు. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అలాగే, ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం సత్తా చాటింది. ఇక, దాదాపు రూ. 19 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఫుల్ రన్‌లో రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో దీనికి హిట్ స్టేటస్ అందుకోవడంతో పాటు రూ. 4 కోట్లకు పైగా లాభాలు కూడా వచ్చాయి.

Agent Movie Akhil Birthday Special Poster Released

అక్కినేని అఖిల్.. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమాను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు 'ఏజెంట్' అనే టైటిల్ పెట్టారు. దీని షూటింగ్ గత ఏడాది ప్రారంభం అయింది. ఇందులో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు కూడా. అదే సమయంలో ఫిజిక్‌ విషయంలోనూ పక్కా ప్యూహంతో వైవిధ్యంగా తయారయ్యాడు. కొద్ది రోజుల క్రితమే అతడి బాడీని చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. దీంతో దీనిపై ఆదిలోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అక్కినేని నట వారసుడు అఖిల్ పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 8). దీన్ని పురస్కరించుకుని 'ఏజెంట్' మూవీ యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఈ కుర్ర హీరో సిగరెట్ కాలుస్తూ పవర్‌ఫుల్ లుక్‌తో దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, బల్క్ బాడీని ఎక్స్‌పోజ్ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా నిప్పులు చింపే అగ్నిపర్వతం ఫీల్ వచ్చేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఫలితంగా ఈ పోస్టర్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది. అదే సమయంలో ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా రెట్టింపు అయిపోయాయి.

Agent Movie Akhil Birthday Special Poster Released

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఏజెంట్' మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X