Agent: అఖిల్ సినిమాలో మెగాస్టార్.. డెవిల్ గెటప్‌తో సర్‌ప్రైజ్ చేసిన స్టార్ హీరో

చిన్న వయసులోనే 'సిసింద్రీ'గా ప్రేక్షకుల దృష్టిలో పడి.. సుదీర్ఘ విరామం తర్వాత 'అఖిల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు ఎదురయ్యాయి. దీని తర్వాత ఈ యంగ్ హీరో 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి చిత్రాల్లోనూ నటించాడు. కానీ, ఇవేమీ అతడికి విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి. దీంతో ఈ అక్కినేని హీరో సక్సెస్ కోసం మరింత కాలం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

వరుస పరాజయాలతో సతమతం అయిన సమయంలో అక్కినేని అఖిల్ గత ఏడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీతో అతడు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం సత్తా చాటింది. ఇక, దాదాపు రూ. 19 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఫుల్ రన్‌లో రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో దీనికి హిట్ స్టేటస్ అందుకోవడంతో పాటు రూ. 4 కోట్లకు పైగా లాభాలు కూడా వచ్చాయి. దీనిపై అక్కినేని అఖిల్‌తో పాటు అభిమానులు సంతోషంగా ఉన్నారు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రిలీజ్ కాకముందే అక్కినేని అఖిల్.. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు 'ఏజెంట్' అనే టైటిల్ పెట్టారు. దీని షూటింగ్ గత ఏడాది ప్రారంభం అయింది. ఇందులో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్‌ విషయంలోనూ వైవిధ్యంగా తయారయ్యాడు. కొద్ది రోజుల క్రితమే అతడి బాడీని చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. దీంతో దీనిపై ఆదిలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Agent Movie Mammootty First Look Released

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న 'ఏజెంట్' మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. 'ద డెవిల్.. ఎంతో క్రూరమైన రక్షకుడు' అంటూ మమ్ముట్టి పాత్రను పరిచయం చేశారు. ఇక, ఈ పోస్టర్‌లో ఈ స్టార్ హీరో చేతిలో గన్ పట్టుకుని.. ఖాకీ బట్టలు ధరించి ఉన్నారు. దీంతో ఈ పోస్టర్‌ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. మమ్ముట్టి 'ఏజెంట్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారని కూడా ఇందులో వెల్లడించారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఏజెంట్' మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X