Agent: అఖిల్ ఏజెంట్ కథను ఎంత పెట్టి కొన్నారంటే.. మొదట్లోనే భారీగా ఖర్చు!
అఖిల్ అక్కినేని హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఏజెంట్. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదల కాగా నెగిటివ్ టాక్ వస్తోంది. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.
అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తుండగా... ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమా కథకు రెండు కోట్లు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. వక్కంతం వంశీ రాసిన ఈ సినిమా కథకు గాను.. ఆయనకు రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారుట. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి రాయించిన స్టోరీ డిజాస్టర్ గా నిలవడంతో అక్కినేని అభిమానులు తెగ ఫీలై పోతున్నారు.

వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి కాంబోలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటించి కిక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టి రవితేజ కెరియర్ ను చాలా పైకి లేపింది. ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రుతి హాసన్ హీరోయిన్ గా 2014లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది.
అయితే వక్కంతం వంశీ దర్శకుడిగా మారిన తర్వాత సురేందర్ రెడ్డి రీమేక్ చిత్రాలు, బయోపిక్స్ చేసుకుంటూ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ అక్కినేని కోసం మరోసారి ఈ బ్లాక్ బస్టర్ హిట్టు కాంబో కలవగా... ఫ్లాప్ అయింది. ఈ ఇద్దరికీ ఈ సినిమా చేదును మిగిల్చింది. అలాగే ఇప్పటికీ వరకు హీరోగా పెద్దగా పేరు తెచ్చుకోలేని అఖిల్ కూడా ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు. కానీ సినిమా డిజాస్టర్ గా నిలిచి అందరినీ షాకయ్యేలా చేసింది.

సినిమా విడుదలైన రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.5.76 కోట్ల షేర్ ను సాధించింది. మొత్తం రూ.10.25 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. సినిమా మొత్తం వాల్యూడ్ బిజినెస్ రూ.36.20 కోట్లు కాగా.. బ్రేక్ ఈనెన్ రూ.37 కోట్లకు ఫిక్స్ అయింది. అఖిల్ ఏజెంట్ సినిమా హిట్టుగా నిలవాలంటే మరో రూ.31.24 కోట్లు రావాలి. వస్తుందనే ఆశ కూడా లేదని చాలా మంది అంటున్నారు.


Click it and Unblock the Notifications











