‘హరిహర వీరమల్లు’ నుంచి సాలిడ్ అప్‌డేట్: పవన్ మూవీలో ఆ ఒక్క దానికే భారీ ఖర్చు

ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టడంతో పాటు రెండింటిని పట్టాలెక్కించేశాడు. అందులో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తైంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ప్రస్తుతానికి చిత్రీకరణ నిలిచిపోయింది. అయినప్పటికీ ఈ సినిమా కోసం బ్యాగ్రౌండ్ వర్క్ మాత్రం జరుగుతూనే ఉందట. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' కోసం భారీ సెట్టింగ్‌లను నిర్మిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. అందుకే ఈ సినిమాకు దాదాపు రూ. 180 కోట్ల వరకూ బడ్జెట్‌ను కూడా కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కోసం ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలో ఆగ్రా కోట సెట్టింగ్‌ను నిర్మిస్తున్నారట. దీనికి దాదాపు రూ. 10 కోట్లు వరకూ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ పున: ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సెట్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం.

Agra Fort Set Erecting for Pawan Kalyans Harihara Veeramallu

పిరియాడిక్ జోనర్‌లో పవన్ కల్యాణ్ నటిస్తోన్న మొట్టమొదటి సినిమా కావడంతో 'హరిహర వీరమల్లు'పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఆ మధ్య విడుదలైన టీజర్ వాటిని రెట్టింపు చేసేసింది. ఇక, ఇందులో పవర్ స్టార్ వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోహినూర్ డైమండ్ నేపథ్యంతో ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X