తీపికబురు చెప్పిన మంచు మనోజ్.. అదే ఎమోషన్, అవే ఫీలింగ్స్ అంటూ సందేశం

Recommended Video

Manchu Manoj Is Back In To Movies,Writes An Emotional Post | Aham Brahmasmi

ఇటీవలే మంచు మనోజ్ తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ డైవర్స్ అనంతరం ఆయన మళ్ళీ పెళ్ళిచుకుంటాడా? అయితే ఎప్పుడు? అనే కోణంలో చర్చలు నడిచాయి. మరోవైపు రెండో పెళ్లి ఇప్పట్లో ఉండదని హింట్ ఇస్తూ వస్తున్న ఈ మంచువారబ్బాయి తాజాగా ఓ తీపి కబురు చెప్పి సర్‌ప్రైజ్ చేశాడు. ఇంతకీ ఏంటా కబురు? వివరాల్లోకి పోతే..

 ఆ మాట చెప్పి ఆలోచనలో పడేసిన మనోజ్

ఆ మాట చెప్పి ఆలోచనలో పడేసిన మనోజ్

''ఫైర్‌బాల్‌లా మీ ముందుకు రాబోతున్నా. వారం రోజుల్లో మీకు ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పబోతున్నా. వెయిట్‌ చెయ్యండి'' అంటూ గత వారం మంచు మనోజ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. దీంతో మనోజ్ ఏం చెప్పబోతున్నాడు? అదే సినిమా గురించా.. లేక వ్యక్తిగత జీవితం గురించా అని అంతా ఆలోచనలో పడిపోయారు.

3 ఏళ్ల తర్వాత ఇలా.. ఓపెన్ అయిన మనోజ్

3 ఏళ్ల తర్వాత ఇలా.. ఓపెన్ అయిన మనోజ్

అయితే తాజాగా ఆసక్తికర విషయాన్ని రివీల్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు మంచు మనోజ్. దాదాపు 3 ఏళ్ల తర్వాత తిరిగి సినిమా చేస్తున్నానని పేరొన్నమనోజ్‌.. ఓ పోస్టర్ ట్యాగ్ చేశాడు. ఈ మేరకు ప్రస్తుతం తన అనుభూతి ఎలా ఉందో కూడా తెలుపుతూ ఓపెన్ అయ్యాడు మనోజ్.

సినీ అమ్మ వచ్చేశా.. లవ్‌ యూ డార్లింగ్స్‌

సినీ అమ్మ వచ్చేశా.. లవ్‌ యూ డార్లింగ్స్‌

''మూడేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. నా తొలి సినిమా ‘దొంగ దొంగది' సమయంలో ఎలాంటి ఎమోషన్‌కు లోనయ్యానో ఇప్పుడు కూడా అలాగే ఫీల్‌ అవుతున్నాను. నా జీవితమైన నా కళను మిస్సయ్యాను. ఇన్నిరోజులు నా ఆఫ్ స్క్రీన్ జర్నీని కూడా సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. సినీ అమ్మ వచ్చేశా. లవ్‌ యూ డార్లింగ్స్‌'' అని మనోజ్‌ తెలిపాడు.

అహం బ్రహ్మాస్మి.. మనోజ్ ఎంటర్

అహం బ్రహ్మాస్మి.. మనోజ్ ఎంటర్

అహం బ్రహ్మాస్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మనోజ్ పేర్కొన్నాడు. ఈ సినిమాను మనోజ్‌ సొంత బ్యానర్‌ మంచు మనోజ్‌ ఆర్ట్స్‌ (MM ఆర్ట్స్) బ్యానర్ పై రూపొందిస్తుండటం విశేషం. విద్య నిర్వాణ మంచు ఆనంద్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. మంచు మనోజ్‌, ఆయన తల్లి నిర్మల దేవి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

వెల్‌కం మనోజ్.. నెటిజన్స్ రెస్పాన్స్

మార్చి 6వ తేదీన అహం బ్రహ్మాస్మి మూవీ అఫీషియల్‌గా ప్రారంభం కానుంది. కాగా మనోజ్ చేసిన ఈ ట్వీట్ చూసి నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. వెల్‌కం మనోజ్ అని కొందరు స్వాగతం పలుకుతుండగా, అద్భుతం అన్న.. తెలుగు పోస్టర్ కోసం ఎదురు చూస్తూ.. అంటూ ఇంకొందరు ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X